
కాలి మీద కాలు వేసుకుని కూర్చుంటున్నారా.. మహిళలు లేదా మగవారు, చిన్న పిల్లలు సైతం కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం సాధారణంగా మారిపోయింది. ఇలా కూర్చోవడం మీకు సౌకర్యంగా ఉండొచ్చు. కేవలం మీరు మాత్రమే కాదు మీ చుట్టూ ఉండే వారు సైతం ఇలానే కాలి మీద కాలు వేసుకుని కూర్చుంటారు. మీకు తెలియకుండా చాలా సార్లు కాలి మీద కాలు వేసుకుని కూర్చుంటారు. కానీ ఇలా ఈ భంగిమలో కూర్చోవడం వల్ల చాలా రకాల నష్టాలు ఉన్నాయన్న విషయాన్ని ఆలోచించి ఉండరు. ఇలా కూర్చోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల్ని కలిగిస్తుంది. జనన సంబంధిత సమస్యలకు కూడా దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జర్నల్ ఆఫ్ క్లీనికల్ నర్సింగ్, జర్నల్ ఆప్ హైపర్ టెన్షన్‌లో ప్రచురించిన రెండు అధ్యయనాల ప్రకారం.. కాలిపై మరో కాలు వేసుకుని కూర్చోవడం వల్ల రక్త పోటు పెరుగుదలకు కారణం అవుతుందని కనుగొన్నారు. మోకాలి మీద వేరే కాలు వేసినప్పుడు రక్త పోటులో కొంచెం స్పైక్ ఉంటుందట. కాలిపై కాలు వేసుకుని అడ్డంగా కూర్చోవడం వల్ల నరాల్లో వాపు, నొప్పి వస్తుందని అంటారు. అయితే ఇది నిజం కాదు. మీ సిరల్లోని కవాటాల్లో కొన్ని సమస్యలు ఉన్నప్పుడు ఎడెమా, వెరికోస్ వీన్స్ ఏర్పడతాయట. దీంతో గుండె వైపు రక్తాన్ని పంప్ చేయడానికి శారీరక శ్రమ అవసరం ఏర్పడుతుంది. ఎక్కువగా నిలబడి లేదా కూర్చునే వారికి వెరికోస్ వీన్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మీరు కూర్చునే భంగిమ వల్ల గర్భిణిలపై కూడా ఎలాంటి ప్రభావం పడదు. శిశువుకు కూడా హాని కలిగించదు. అయితే చీల మండ నొప్పి, కండరాల ఒత్తిడి లేదా వెన్ను నొప్పిని అనుభవించవచ్చు. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నప్పుడు ప్రసవంలో సమస్యలు వస్తాయని చెబుతారు. అయితే అవి ఇతర సమస్యల వల్ల కూడా అయి ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే కాలి మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల కీళ్ల లేదా మోకాళ్ల సమస్యలకు కారణం అవుతుంది.
మీరు ఎక్కువగా మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నట్లయితే.. మీరు ఒకే పొజిషన్‌లో ఎక్కువ సేపు కూర్చోకూడదు. అలా కూర్చుంటే మీ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. గంటలు గంటలు ఒకే దగ్గర కూర్చోకూడదు. మధ్య మధ్యలో లేచి నడుస్తూ ఉండాలి. ఇలా చేస్తేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.