
Raw Egg
గుడ్డు అనేది ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో నిండిన సూపర్ ఫుడ్. చాలా మంది అల్పాహారంగా ఉడికించిన గుడ్లు తినడానికి ఇష్టపడతారు. అదే సమయంలో కొంతమంది ఆమ్లెట్ లేదా స్క్రాంబుల్డ్ గుడ్లు తింటారు. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. తమ ఫిట్‌నెస్ గురించి ఎక్కువ శ్రద్ధ వహించే వ్యక్తులను పచ్చి గుడ్లు తినడం లేదా అల్పాహారంగా సగం ఉడికించిన గుడ్లు తినడం తరచుగా చూసి ఉంటారు.
అయితే ఇలా పచ్చి గుడ్లని తినడం పూర్తిగా సురక్షితం కాదు. ఎందుకంటే ఇందులో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంది. ఇది ఆరోగ్యానికి హానికలిగిస్తుంది. ఈ రోజు పచ్చి గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే హాని గురించి తెలుసుకుందాం. ఒకసారి పచ్చి గుడ్లు తినడం వలన కలిగే హాని గురించి తెలుసుకుంటే.. మళ్ళీ తినే ప్రయత్నం చేయరు.
పచ్చి గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటంటే
- ఉడికించని గుడ్లను, లేదా సరిగ్గా ఉడకని పచ్చి గుడ్లని తినడం వలన దీనిలో ఉన్న సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా శరీరమంతా వ్యాపిస్తుంది. కనుక గుడ్లు ఉడికించి లేదా వేయించుకుని తినాలి.
- కొంతమందికి పచ్చి లేదా సరిగ్గా ఉడికించని గుడ్లు అలెర్జీ కావచ్చు . అటువంటి పరిస్థితిలో ఆరోగ్య స్థితిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే పచ్చి గుడ్లను తినే ఆహారంలో చేర్చుకోవాలి.
- పచ్చి గుడ్లు తినడం వలన ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం కూడా పెరుగుతుంది. గుడ్లలో ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యానికి హానికరం.
- జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇప్పటికే కడుపు సంబంధిత సమస్యలు ఉంటే.. పొరపాటున కూడా పచ్చి గుడ్డుని తినకండి.
- పచ్చి గుడ్లు తింటే శరీరానికి సరైన మొత్తంలో ప్రోటీన్ లభించదు. అందుకే గుడ్లను ఉడకబెట్టడం లేదా ఉడికించి తినడం ఎల్లప్పుడూ మంచిది. దీనివల్ల శరీరానికి హాని కలుగకుండా నిరోధించవచ్చు.
గుడ్లలో అనేక పోషకాలున్నాయి.
- గుడ్డు ప్రోటీన్ కు మంచి మూలం.
- గుడ్లలో విటమిన్ బి12, విటమిన్ డి, విటమిన్ ఎ , విటమిన్ బి5 లు లభిస్తాయి.
- సెలీనియం, భాస్వరం , జింక్ వంటి పోషకాలు కూడా గుడ్లలో కనిపిస్తాయి.
- గుడ్లలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మంచి మొత్తంలో ఉన్నాయి
గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
- గుడ్లు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
- మన మానసిక ఆరోగ్యానికి గుడ్డు కూడా ముఖ్యమైనది.
- ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వల్ల, ఇది బరువును కూడా నిర్వహిస్తుంది.
- గుడ్లలో లభించే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
- ఇది కండరాలను బలోపేతం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)