Curd for Skin: పెరుగు ఇలా ముఖానికి రాసుకుంటే.. డైమెండ్‌లా ప్రకాశవంతంగా మెరిసిపోతుంది!

అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. అందులోనూ అందరిలో ప్రత్యేంకగా కనిపించాలని పరితపిస్తూ ఉంటారు. అందుకే పెళ్లిళ్లు, ఫంక్షన్లు వచ్చాయంటే.. అందరి కంటే స్పెషల్‌గా కనిపంచాలని.. రెడీ అవుతూ ఉంటారు. అందులోనూ పెళ్లి కాని వారి గురించి చెప్పాల్సిన పని లేదు. అందర్నీ ఆకట్టుకోవడానికి నానా హైరానా పడుతూ ఉంటారు. అలా కనిపించడం కోసం ఎంతో ఖర్చు పెట్టి కాస్మెటిక్స్ ఉపయోగిస్తారు. వేలకు వేలు పెట్టి..

Curd for Skin: పెరుగు ఇలా ముఖానికి రాసుకుంటే.. డైమెండ్‌లా ప్రకాశవంతంగా మెరిసిపోతుంది!
Curd For Skin

Edited By:

Updated on: Jun 05, 2024 | 3:23 PM

అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. అందులోనూ అందరిలో ప్రత్యేంకగా కనిపించాలని పరితపిస్తూ ఉంటారు. అందుకే పెళ్లిళ్లు, ఫంక్షన్లు వచ్చాయంటే.. అందరి కంటే స్పెషల్‌గా కనిపంచాలని.. రెడీ అవుతూ ఉంటారు. అందులోనూ పెళ్లి కాని వారి గురించి చెప్పాల్సిన పని లేదు. అందర్నీ ఆకట్టుకోవడానికి నానా హైరానా పడుతూ ఉంటారు. అలా కనిపించడం కోసం ఎంతో ఖర్చు పెట్టి కాస్మెటిక్స్ ఉపయోగిస్తారు. వేలకు వేలు పెట్టి.. ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో ఉండే వాటితోనే తక్కవు ఖర్చుతో ఈజీగా మీ ముఖాన్ని మెరిపించు కోవచ్చు. అలా మీ ముఖాన్ని మెరిపించడంలో పెరుగు కూడా ఒకటి. పెరుగుతో ఆరోగ్యమే కాదు.. సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. పెరుగుతో చిన్న చిన్న టిప్స్ ట్రై చేస్తే.. మీ ముఖం డైమెండ్‌లా మెరవడం ఖాయం. మరి పెరుగుతో ఎలాంటి టిప్స్ ట్రై చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.

పెరుగులో గుణాలు:

పెరుగులో అందాన్ని పెంచే గుణాలు సమృద్ధిగా లభిస్తాయి. చర్మానికి సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పెరుగు పని చేస్తుంది. చర్మంపై ఉండే గీతలు, ముడతలను తగ్గిస్తుంది. చర్మానికి బ్లీచింగ్ ఎఫెక్ట్‌ని అందిస్తాయి. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మానికి మేలు చేస్తుంది. పుల్లటి పెరుగు అయితే చాలా మంచిది.

స్క్రబ్బింగ్:

కాస్త పెరుగును తీసుకుని ముఖానికి పట్టించి.. కాసేపు స్క్రబ్ చేయండి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మురికి పోయి.. క్లీన్ అవుతుంది. ఎలాంటి చర్మం ఉన్నవారైనా పెరుగు బాగా సూట్ అవుతుంది. ముఖానికి మంచి నిగారింపు వస్తుంది.

ఇవి కూడా చదవండి

పెరుగు – కాఫీ పొడి:

పెరుగులో కొద్దిగా కాఫీ పొడి, చక్కెర కలిపి మిక్స్ చేసి.. ముఖానికి పట్టించి స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే డల్ నెస్, బ్లాక్ హెడ్స్ అనేది దూరమవుతాయి. అలాగే ముఖం సాఫ్ట్‌గా తయారవుతుంది.

పెరుగు – టమాటా:

టమాటా కూడా చర్మాన్ని అందంగా చేయడంలో చక్కగా పని చేస్తుంది. కొద్దిగా పెరుగులో టమాటా గుజ్జు కలిపి.. ముఖానికి పట్టించి సున్నితంగా మర్దనా చేయండి. ఇలా ఓపావు గంట సేపు ఉంచాక.. ముఖాన్ని రుద్దుతూ కడిగేయండి. వారంలో రెండు సార్లు ఇలా చేయండి.. మీ ముఖం కాంతి వంతంగా మారడం ఖాయం. ఇలా పెరుగుతో చాలా రకాల ఫేస్ ప్యాక్‌లు తయారు చేసి వేసుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..