Amla Benefits: ఉసిరికాయలను ఇలా వాడితే జుట్టు రాలడం తగ్గడమే కాదు… చర్మ సమస్యలు కూడా దూరం….

|

Jun 11, 2021 | 3:02 PM

చర్మం, జుట్టు సమస్యలకు ఆమ్లా ఎక్కువగా ఉపయోగపడుతుందన్న సంగతి తెలిసిందే. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Amla Benefits: ఉసిరికాయలను ఇలా వాడితే జుట్టు రాలడం తగ్గడమే కాదు... చర్మ సమస్యలు కూడా దూరం....
Amla
Follow us on

చర్మం, జుట్టు సమస్యలకు ఆమ్లా ఎక్కువగా ఉపయోగపడుతుందన్న సంగతి తెలిసిందే. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మం పై ఏర్పడే టోన్ సమస్యలను నివారించడానికి సహయపడుతుంది. అలాగే చుండ్రు సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు, చర్మ సమస్యలను తగ్గించడానికి ఉసిరికాయలను ఏవిధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మొటిమల మచ్చలు..
మొటిమలతో ఏర్పడిన మచ్చలను తొలగించడానికి ఆమ్లా ఎక్కువగా సహయపడుతుంది. ముఖంపై ఈ ఆమ్లా పేస్ట్ అప్లై చేసి దాదాపు 30 నిమిషాలు వదిలేయాలి.. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా చేస్తే క్రమంగా మొటిమలతో ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి.

మృత కణాలను తొలగిస్తుంది…
ఆమ్లా రసాన్ని ఫేస్ స్క్రబ్ గా వాడితే.. చర్మంపై ఉండే ఎక్స్ ఫోలియేట్ పూర్తి తొలగిపోతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, చర్మంపై ఉండే టోన్ తొలగించడంలో సహయపడతాయి. ఒక స్పూన్ ఆమ్లా ఫౌడర్ తీసుకొని అందులో కొంచెం గోరు వెచ్చని నీటిని కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖాన్ని స్క్రబ్ చేయాడానికి ఉపయోగించాలి. ఇలా ఐదు నిమిషాలు చేసి ఆతర్వాత కడిగేయ్యాలి. సమస్య ఎక్కువగా ఉన్నవారు అందులో కాస్త పసుపు కూడా కలుపుకోవచ్చు.

జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది…
జుట్టుకు ఆమ్లా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. కొద్ది కొద్దిగా పొడి గూస్బెర్రీ తీసుకొని నీటిలో మరిగించాలి. అది బాగా ఉడికిన తర్వాత దానిని మాష్ చేసి గుజ్జును పేస్ట్ గా మార్చాలి. దానిని జుట్టుకు ప్యాక్ లా అప్లై చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాదు.. ఉసిరి కాయ రసాన్ని జుట్టు అప్లై చేసి.. అరగంట తర్వాత కడిగితే జుట్టు రాలడం తగ్గుతుంది. ఆమ్లా హెయిర్ ఆయిల్, ఆమ్లా కండీషనర్ ఉపయోగించడం వలన మీ జుట్టు మరింత నిగారింపుగా కనిపిస్తుంది.

ఆమ్లా హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలంటే..
ఒక కప్పు ఉసిరికాయలను మెత్తగా పేస్ట్ గా రుబ్బుకోవాలి. గూస్బెర్రీని నీరు కలపకుండా రుబ్బి .. ఫిల్టర్ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి నూనె, ఆమ్లా రసాన్ని కలిపి వేడి చేసుకోవాలి. అలా 10-15 నిమిషాలు వేడి చేసి.. బ్రౌన్ కలర్ వచ్చాక దింపి చల్లార్చుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ పాత్రలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ ను తలస్నానం చేయడానికి 20 నిమిషాల ముందు తలకు మర్దన చేయడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది.

Also Read: Raviteja: మరో ప్రాజెక్ట్‏కు రవితేజ గ్రీన్ సిగ్నల్ .. వచ్చే నెలలో సెట్స్ పైకి మాస్ మహారాజా న్యూమూవీ.. అప్‏డేట్ ఇచ్చిన డైరెక్టర్..