Hair Beauty Tips: జుట్టుకు సంబంధిత ఉత్పత్తి సాధనాలలో ఇవి తప్పక ఉండేలా చూసుకోండి..

మారుతున్న వాతావరణం మన జుట్టు మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఇంటి నుంచి గడప బయటకు కాలు పెడితే చాలు.. అడుగడుగున కాలుష్యం మనల్ని కబళిస్తుంది. దీంతో చర్మ, జుట్టు సంబంధిత వ్యాధులు ఇట్టే చుట్టుముడతాయి. పైగా పని ఒత్తిడి కారణంగా కూడా జుట్టు రాలిపోవడం లాంటివి తెలత్తుతాయి.

Hair Beauty Tips: జుట్టుకు సంబంధిత ఉత్పత్తి సాధనాలలో ఇవి తప్పక ఉండేలా చూసుకోండి..
Hair Beauty Tips

Edited By: Ram Naramaneni

Updated on: Mar 30, 2024 | 12:06 PM

మారుతున్న వాతావరణం మన జుట్టు మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఇంటి నుంచి గడప బయటకు కాలు పెడితే చాలు.. అడుగడుగున కాలుష్యం మనల్ని కబళిస్తుంది. దీంతో చర్మ, జుట్టు సంబంధిత వ్యాధులు ఇట్టే చుట్టుముడతాయి. పైగా పని ఒత్తిడి కారణంగా కూడా జుట్టు రాలిపోవడం లాంటివి తెలత్తుతాయి. కొంత జాగ్రత్త వహించి పలు టిప్స్ పాటిస్తే అందమైన, ఒత్తైన కురులను మీ సొంతం చేసుకోవచ్చు. మీరు నిత్యం శిరోజాల పెరుగుదలకు ఉపయోగించే ఉత్పత్తుల్లో ఇవి ఉన్నాయో లేవో ఒక్కసారి చెక్ చేసుకోంది. వీటిని మిస్ అయితే ఎంత విలువైన ప్రొడక్ట్ అయినా వృధానే అని చెప్పాలి.

ఉసిరి:

ఉసిరి ఆయుర్వేద శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ మూలకం పుష్కలంగా ఉండటం వల్ల కుదుళ్లను బలపరుస్తుంది. జుట్టు రాలకుండా నియంత్రిస్తుంది. ఉసిరిలో యాంటీ అక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. దీని వల్ల త్వరగా నెరసిపోవడం, రంగు మారిపోవడం వంటి సమస్యలు తలెత్తవు. పైగా ఆమ్లాను మన కురుల సౌందర్యసాధనాల్లో కలిగి ఉండటం వల్ల తలలో దురదలు, చికాకు, చుండ్రు వంటి సమస్యలు ధరిచేరకుండా రక్షణ వలయంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కలబంద:

కలబందలో విటమిన్ ఎ, సి, ఇ సంవృద్దిగా ఉంటాయి. అందుకే వీటిని పచ్చిగా జూస్ చేసుకుని తాగుతూ ఉంటారు. తద్వారా జీర్ణ వ్యవస్థ మంచిగా పనిచేయడమే కాకుండా శరీరంలోని విటమిన్ లోపాన్ని అధిగమిస్తుంది. ఈ మూడు విటమిన్లు శరీరంలోని కణాల వృద్దికి ఎంతగానో దోహదపడతాయి. జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా నిగనిగలాడేలా, మెరిసేలా చేస్తుంది. అలోవెరా జెల్ లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 ఉంటుంది. ఈ రెండు జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. వెంట్రుకలను మృదువుగా ఉండేలా చేస్తుంది.

త్రిఫల:

త్రిఫల అనేది త్రిదోషిక్ అనే రసాయనం. త్రిదోషిక్ అంటే శరీరంలోని మూడు దోషాలను నివారించేది అని అర్థం. అసమతుల్యతను సమతుల్యంగా చేస్తుంది. వాత, పిత్త, కఫాన్ని నివారిస్తుంది. జుట్టుకు దీనికి సంబంధం ఏంటి అనే అనుమానం మీలో రావచ్చు. జుట్టు పెరుగుదల, రాలిపోవడానికి ప్రధాన కారణాలు బాహ్యంగానే కాకుండా లోపల రక్తంలోని లోపాల వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీటిని ఉపయోగించడం వల్ల కురుల్లో నుంచి చర్మం లోపలకు చొచ్చుకొని పోయి మంచి ప్యూరిఫైయర్ గా పనిచేస్తుంది. అంతర్గతంగా ఉన్న రక్తంలోని లోపాలను ప్రక్షాలన చేస్తుంది. తద్వారా అరోగ్యవంతమైన శరీరం, ఆరోగ్యకరమైన జుట్టు కలిగేందుకు దోహదపడుతుంది.

ఎర్ర ఉల్లిగడ్డ:

ఎర్ర ఉల్లిపాయల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని పేస్ట్ చేసి తలకు మర్ధన చేయడం వల్ల తలలో పుండ్లు, చర్మసంబంధిత వ్యాధులు తలెత్తవు. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పైగా స్కల్ సమస్యలను కూడా అధిగమించవచ్చు. ఈ ఉల్లిలోని మూలకాలు చుండ్రు, పేలు, దురదను నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో లభించే సల్ఫర్ చర్మ, జుట్టు సంబంధిత చికిత్సలో ఉత్తమ ఔషధంగా పనిచేస్తుంది.

అందుకే జుట్టుకు సంబంధిత ఉత్పత్తులను కొనే ముందు ఈ ఐదు అందులో ఉన్నయో లేవో చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..