మామిడిని అన్ని పండ్లలో రారాజు అని పిలుస్తారు. ఈ టైటిల్ వెనుక చాలా కారణాలున్నాయి. మామిడి రుచి ఇతర పండ్లకంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. రెండవది, మామిడిలోని పోషక మూలకాలు కూడా ఇతర పండ్ల కంటే రెట్టింపుగా ఉంటాయి. పచ్చి, పండిన మామిడి పండ్లు మాత్రమే కాదు, దాని ఆకులు, టెంకలు కూడా చాలా ప్రయోజనాలను కలిగి ఉంటాయి. మామిడి ఆకుల ప్రయోజనాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మామిడి ఆకుల్లో పుష్కలమైన ఔషధ గుణాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఈ ఆకులను రోజూ నమలడం, రసం తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
మామిడి ఆకులలో విటమిన్ సి, బి, ఎ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకుల్లో అనేక ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. మామిడి ఆకులలో ఫ్లేవనాయిడ్లు, ఫినాల్స్ అధిక మొత్తంలో ఉన్నందున శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఈ ఆకులలో ఔషధ గుణాలు అనేకం ఉన్నాయి. అనేక ఆరోగ్య సమస్యలను కూడా నయం చేస్తాయి.
మామిడి ఆకుల ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
బరువు తగ్గడంలో సహాయపడుతుంది: రోజూ మామిడి ఆకు టీ తాగితే వేగంగా బరువుతగ్గుతారు. ఎందుకంటే ఇది నేచురల్ మెటబాలిజం బూస్టర్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడంలో మీకు చాలా సహాయపడుతుంది. మామిడి ఆకుల్లో పాపైన్ అనే ఎంజైమ్, లెప్టిన్ అనే హార్మోన్ ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. శరీరంలో కొవ్వు పెరగకుండా నిరోధిస్తాయి.
చక్కెర నియంత్రణ: మామిడి ఆకు రసం చక్కెర, ఊబకాయం నియంత్రణలో సహాయపడుతుంది. డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ చేయడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. మామిడి చెట్టు ఆకులలో ఆంథోసైనిన్ అనే టానిన్ ఉంటుంది. ఇది ప్రారంభ మధుమేహం చికిత్సలో సహాయపడుతుంది.
రక్తపోటును అదుపులో ఉంచుతుంది: మామిడి ఆకుల్లో రక్తపోటును తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కాకుండా, రక్త నాళాలను బలోపేతం చేయడంలో ఆకులు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇది రక్తపోటు సమస్యలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
క్యాన్సర్ నిరోధక గుణాలు: పండులాగే మామిడి ఆకులు కూడా పాలీఫెనాల్స్, టెర్పెనాయిడ్స్ రూపంలో యాంటీఆక్సిడెంట్ల వంటి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. ఇవి క్యాన్సర్ కణాలను దెబ్బతీస్తాయి.
చర్మ సంరక్షణలో: చర్మ సమస్యల విషయంలో కూడా మామిడి ఆకుల ఉపయోగం ఉంది. చర్మం చికాకులు, దద్దుర్లు నయం చేయడానికి వీటిని ఉపయోగించవచ్చు. అదనంగా, మామిడి ఆకు సారం దాని యాంటీఆక్సిడెంట్ మూలకాల కారణంగా చర్మం వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
జుట్టు సమస్యలకు పరిష్కారం: జుట్టు సంరక్షణ కోసం మీరు రసాయన ఉత్పత్తులను ఉపయోగించి అలసిపోయినట్టయితే, మామిడి ఆకులు ఒక సహజ పరిష్కారంగా పనిచేస్తాయి. మామిడి ఆకుల్లో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి జుట్టు అకాల నెరసిపోవడాన్ని నివారిస్తాయి. అదనంగా, విటమిన్ సి, ఎ వంటి పోషకాల ఉనికి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను నిర్వహిస్తుంది.
ఇన్‌ఫ్లమేటరీ కణాలను తగ్గింస్తుంది: మామిడి ఆకులలో టెర్పెనాయిడ్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మొక్కల సమ్మేళనాలు వ్యాధుల నుండి రక్షిస్తాయి. శరీరంలో మంటతో పోరాడుతాయి. నిజానికి, మామిడి ఆకులలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అల్జీమర్స్ వంటి పరిస్థితుల నుండి మీ మెదడును కూడా కాపాడతాయి.
మామిడి ఆకులు తినదగినవేనా?: అవును, మామిడి ఆకులు తింటే చాలా ఆరోగ్యకరం. ఇందుకోసం మామిడి ఆకులతో టీ తయారు చేసుకుని తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, పెద్ద వంటలు పెద్ద మొత్తంలో నాన్‌వెజ్ చేసే క్రమంలో చాలా మంది మామిడి ఆకులను ఉపయోగిస్తుంటారు. దీని ఉపయోగాలు తెలిసిన మరికొంతమంది మామిడి ఆకుల పొడిని నీటిలో కలిపి తాగుతుంటారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..