నల్ల జీలకర్రలో పోషకాలు మెండు..! దీని అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

|

Dec 22, 2024 | 12:09 PM

ద‌గ్గు, జ‌లుబు వంటి ఇన్ ఫెక్ష‌న్ ల‌ను త‌గ్గించ‌డంలోనూ నల్ల జీల‌క‌ర్ర ముందుంటుంది. న‌ల్ల జీల‌క‌ర్ర క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల ఇతర అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్నింటి నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ న‌ల్ల జీల‌క‌ర్ర‌ర‌ను వేసి అర గ్లాస్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించి వ‌డ‌క‌ట్టాలి. ఈ క‌షాయాన్ని..

నల్ల జీలకర్రలో పోషకాలు మెండు..! దీని అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..
Black Cumin
Follow us on

సాధారణ జీలకర్ర అందరికీ తెలుసు.. కానీ, నల్ల జీలకర్ర గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..! ఆయుర్వేదంలో ఈ న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ఇందులో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనినే చేదు జీల‌క‌ర్ర అని కూడా అంటారు. న‌ల్ల జీల‌క‌ర్ర‌లో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. న‌ల్ల జీల క‌ర్ర‌లో ఉండే ర‌సాయ‌నిక ప‌దార్థాలు శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. న‌ల్ల జీల‌క‌ర్రతో దాదాపు అన్ని ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చని ఆరోగ్య నిపుణులు చెబుతారు.

న‌ల్ల జీల‌క‌ర్ర యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ వైర‌స్, యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది. శ‌రీరంలో త‌గినంత ఆక్సిజ‌న్ లేక‌పోవ‌డం వ‌ల్ల వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో న‌ల్ల జీల‌క‌ర్ర ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. కడుపు సంబంధిత స‌మ‌స్య‌ల‌ను, మూత్ర‌పిండాల సంబంధిత స‌మ‌స్య‌ల‌ను, కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో న‌ల్ల జీల‌క‌ర్ర దివ్య ఔష‌ధంగా ప‌ని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శ‌రీరంలో అధికంగా ఉండే కొవ్వును క‌రిగించంలో, బీపీని నియంత్రించ‌డంలో, చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో కూడా ఈ న‌ల్ల జీల‌క‌ర్ర దోహ‌ద‌ప‌డుతుంది. శ‌రీరంలో ఉండే నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గిస్తుంది.

ప్ర‌స్తుతం వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా మ‌నం ఇన్ ఫెక్షన్‌ల బారినపడుతున్నారు. క‌నుక న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఉప‌యోగించడం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి, ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటామ‌ని నిపుణులు చెబుతున్నారు. ద‌గ్గు, జ‌లుబు వంటి ఇన్ ఫెక్ష‌న్ ల‌ను త‌గ్గించ‌డంలోనూ నల్ల జీల‌క‌ర్ర ముందుంటుంది. న‌ల్ల జీల‌క‌ర్ర క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల ఇతర అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్నింటి నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ న‌ల్ల జీల‌క‌ర్ర‌ర‌ను వేసి అర గ్లాస్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించి వ‌డ‌క‌ట్టాలి. ఈ క‌షాయాన్ని గోరు వెచ్చ‌గా ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల మనం రోగాల బారిన ప‌డ‌కుండా రక్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.