ఇది షో పీస్‌ కాదు.. సర్వరోగాలకు దివ్యౌషధం..! ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

ఇకపోతే, ఇంటి ఆవరణలో పెంచుకునే ఔషధ మొక్కలలో ర‌ణ‌పాల మొక్క కూడా ఒకటి. దీని శాస్త్రీయ నామం బ్ర‌యోఫిలం పిన్న‌టం. ఆయుర్వేదంలో ఈ ర‌ణ‌పాల మొక్క‌ను ఎన్నో ఏళ్లుగా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. రణపాల ఉపయోగాలు, ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...

ఇది షో పీస్‌ కాదు.. సర్వరోగాలకు దివ్యౌషధం..! ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..
Ranapala Leaves

Updated on: May 28, 2025 | 1:58 PM

Ranapala : ప్రస్తుతం చాలా మంది మొక్కల పెంపకంపై ఇష్టం పెంచుకుంటున్నారు. ఎంత చిన్నా ఇల్లు ఉన్నా సరే.. ఉన్నంతలో అందమైన, లేదంటే అవసరమైన ఔషధ మొక్కలు, ఆకులు కూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను పెంచుతున్నారు. టెర్రస్‌ గార్డెన్‌ పేరుతో కొందరు చిన్నపాటి వ్యవసాయమే చేస్తున్నారు. ఇకపోతే, ఇంటి ఆవరణలో పెంచుకునే ఔషధ మొక్కలలో ర‌ణ‌పాల మొక్క కూడా ఒకటి. దీని శాస్త్రీయ నామం బ్ర‌యోఫిలం పిన్న‌టం. ఆయుర్వేదంలో ఈ ర‌ణ‌పాల మొక్క‌ను ఎన్నో ఏళ్లుగా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. రణపాల ఉపయోగాలు, ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…

ర‌ణ‌పాల మొక్క ఆకులు మందంగా, వ‌గ‌రు, పులుపు రుచిని క‌లిగి ఉంటాయి. ఈ మొక్క‌లో యాంటీ వైర‌ల్, యాంటీ ఫంగ‌ల్, యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం వల్ల బీపీ, షుగ‌ర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయని అంటున్నారు. మూత్ర‌పిండాల్లో రాళ్ల‌తో పాటు మూత్ర‌సంబంధింత స‌మ‌స్య‌ల‌ను కూడా ర‌ణ‌పాల మొక్క‌ను ఉప‌యోగించి న‌యం చేసుకోవ‌చ్చునని సూచిస్తున్నారు.

అంటు వ్యాధులు, గాయాలు, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్నవారికి రణపాల అద్భుత మూలికా ఔషధంగా చెబుతున్నారు. రణపాల ఆకులతో టీ తయారు చేసుకుని తాగ‌డం వల్ల తిమ్మిర్లు, ఉబ్బ‌సం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు. ఈ మొక్క ఆకుల‌ను పేస్ట్ గా చేసి లేప‌నంగా రాసుకోవ‌డం వ‌ల్ల న‌డుము నొప్పి, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు నయం చేస్తుంది.. మొల‌ల స‌మ‌స్య‌తో బాధ‌పడే వారు ర‌ణ‌పాల మొక్క ఆకుల్లో మిరియాలు క‌లిపి తిన‌డం వ‌ల్ల మొల‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు అంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..