కాలిన గాయాలకు కలబంద దివ్యఔషధం.. ఇందులోని సుగుణాలు ఎన్ని రోగాలను నయం చేస్తాయో తెలిస్తే..

|

Mar 13, 2021 | 9:50 PM

Aloe Vera Medicine For Burns : నిత్యజీవితంలో చిన్న చిన్న ప్రమాదాలు సహజమే. అనుకోకుండా కాలిన చర్మానికి సాధారణంగా

కాలిన గాయాలకు కలబంద దివ్యఔషధం.. ఇందులోని సుగుణాలు ఎన్ని రోగాలను నయం చేస్తాయో తెలిస్తే..
Aloe Vera Medicine For Burn
Follow us on

Aloe Vera Medicine For Burns : నిత్యజీవితంలో చిన్న చిన్న ప్రమాదాలు సహజమే. అనుకోకుండా కాలిన చర్మానికి సాధారణంగా మీరు వెంటనే ఏం చేస్తారు? వైద్యుడు సూచించిన మందులు వాడతారా? అవి కొద్దిసేపు ఉపశమనం కలిగించినా, మంటను ఎక్కువసేపు పూర్తిగా తగ్గించలేవు . కాలినగాయం మంట నుంచి వెంటనే విముక్తి కావాలంటే, కలబంద రసం వాడవచ్చు. కలబంద ఒక మాయావృక్షం లాంటిది. ఎన్నో వేల ఏళ్ళ క్రితం నుంచి చర్మసమస్యలకు, కాలినగాయాలకు దీన్ని వాడుతూ వచ్చారు. తేమను పెంచి, నయం చేసే దీని శక్తి వలన గాయమైన చర్మప్రాంతంలో కొత్త చర్మం త్వరగా వస్తుంది.

కలబంద ఆకును శుభ్రమైన చాకుతో అడ్డంగా కోసి, అందులో గుజ్జును తీయండి. ఈ గుజ్జుని నేరుగా గాయమైన చోట పూయండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఒక 5-6 నిమిషాలపాటు ఆ గుజ్జు పూర్తిగా పట్టేట్లా మర్దన చేయండి. తడిగుడ్డతో దాన్ని అంతా తుడిచేయండి. ఈ ఆలోవెరా లోషన్ లో అవకాడో కూడా ఉంటుంది. ఇది కాలిన గాయాలపై చాలా మంచి ప్రభావం చూపిస్తుంది. అవకాడోను కోసి అందులో గుజ్జును బయటకి తీయండి. కలబంద ఆకులో కూడా గుజ్జు బయటకి తీయండి. రెండింటిని ఒక గిన్నెలో కలిపి, ఆలివ్ నూనెను జతచేయండి. కావాల్సినంత గాయానికి రాస్తూ మిగిలినది ఒక పొడి డబ్బాలో పోసి, ఫ్రిజ్ లో పెట్టుకుని తర్వాత వాడుకోండి.

కలబంద, మంచుల కలయిక కాలిన గాయాలనుంచి వెంటనే ఉపశమనం ఇస్తుంది. కలబంద ఆకుని కోసి గుజ్జును తీయండి. గుజ్జు, నీరును మిక్సర్ లో వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఐస్ క్యూబ్ ట్రేలో పోసి, ఫ్రిజ్ లో గడ్డకట్టేట్లు చేసి గాయంపై వాడుకోండి. ఈ ఐస్ క్యూబ్ లను గుడ్డలో చుట్టి గాయంపై రాయాలని మర్చిపోకండి. ఇలా అయితే నేరుగా తగలకుండా ఉంటుంది. ఈ చిట్కాల వల్ల కాలిన గాయాలకు వెంటనే ఉపశమనం లభిస్తుంది. అంతేకాక, కలబంద కాలిన మచ్చలు కూడా తగ్గిస్తుంది.

Air travel: అదిరిపోయే బంపర్‌ ఆఫర్‌.. 999 రూపాయలకే విమానంలో ప్రయాణం.. మూడు రోజులే ఛాన్స్‌

చింత పంటను కోతుల బారి నుంచి కాపాడుకునేందుకు మహిళ అద్భుత చిట్కా.. వానరాల ఆ ఏరియాకి వస్తే ఒట్టు..!

Spider Monkey: ఆ కొండముచ్చు కోసం ఊరు ఊరంతా ఏడ్చేసింది.. కారణం తెలిస్తే మీరూ అయ్యో అంటారు..