Coconut Sugar Uses: కొబ్బరి చక్కెర తింటే జరిగేది ఇదే.. ఊహించని బెనిఫిట్స్!

|

May 16, 2024 | 3:49 PM

చక్కెరను పలు భాషల్లో వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. చక్కెర అంటే చాలా మందికి ఇష్టం. పంచదారతో ఎలాంటి రెసిపీలు తయారు చేసినా చాలా రుచిగా వస్తాయి. కానీ ఈ తెల్లగా కనిపించే చక్కెర తింటే వచ్చే వ్యాధులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా డయాబెటీస్ వస్తుంది. ఒక్కసారి షుగర్ వ్యాధి బారిన పడ్డారంటే.. జీవితాంతం ఇది మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది. కాబట్టి షుగర్‌కు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే కొబ్బరి చక్కెరతో..

Coconut Sugar Uses: కొబ్బరి చక్కెర తింటే జరిగేది ఇదే.. ఊహించని బెనిఫిట్స్!
Coconut Sugar
Follow us on

చక్కెరను పలు భాషల్లో వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. చక్కెర అంటే చాలా మందికి ఇష్టం. పంచదారతో ఎలాంటి రెసిపీలు తయారు చేసినా చాలా రుచిగా వస్తాయి. కానీ ఈ తెల్లగా కనిపించే చక్కెర తింటే వచ్చే వ్యాధులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా డయాబెటీస్ వస్తుంది. ఒక్కసారి షుగర్ వ్యాధి బారిన పడ్డారంటే.. జీవితాంతం ఇది మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది. కాబట్టి షుగర్‌కు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే కొబ్బరి చక్కెరతో మాత్రం బెనిఫిట్సే తప్ప నష్టాలు అనేవి చాలా తక్కువ. ఈ కొబ్బరి చక్కెరను తాటి చెట్ల పూల మొగ్గల నుంచి తయారు చేస్తారు. ఈ కొబ్బరి చక్కెర తక్కువ ప్రాసెసింగ్‌తో తయారవుతుంది. చూడటానికి క్యారెమిల్‌ పొడిలా ఉంటుంది. రుచి కూడా అలాగే ఉంటుంది. కొబ్బరి చక్కెర సహజమైన స్వీట్‌నెర్ కాబట్టి.. ఎలాంటి సందేహం లేకుండా తినవచ్చు. మరీ ఈ కొబ్బరి చక్కెర తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ కంట్రోల్:

సాధారణ పంచదారకు బదులు ఈ కొబ్బరి చక్కెర తీసుకుంటే.. శరీరంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిది.

వెయిట్ లాస్:

కొబ్బరి చక్కెర తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. ఎందుకంటే సాధారణ చక్కెరతో పోలిస్తే.. ఇందులో కేలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి ఎంపిక.

ఇవి కూడా చదవండి

పోషకాలు మెండు:

సాధారణ చక్కెరతో పోలిస్తే.. ఇందులో పోషకాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. క్యాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి లభ్యమవుతాయి. కాబట్టి కోకోనట్ షుగర్ తీసుకోవడం చాలా మంచిది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

కోకోనట్ షుగర్ తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు వంటి పోషకాలు ఉంటాయి కాబట్టి.. తరచూ కొబ్బరి చక్కెర తీసుకుంటే శరీరంలో ఇమ్యూనిటీ అనేది బల పడుతుంది. దీంతో సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.

జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది:

కొబ్బరి చక్కెరలో ఫైబర్ కంటెంట్ కూడా లభిస్తుంది. కాబట్టి ఇది తీసుకోవడం వల్ల జీర్ణ క్రియను మెరుగు పరచడంలో, పొట్ట ఆరోగ్యం పెంచడంలో హెల్ప్ చేస్తుంది. మల బద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..