Benefits Of Ajwain: వామును ఈ విధంగా తీసుకుంటే వారంలో పొట్ట హాంఫట్.. ఇంకా ఆ అవసరమే ఉండదట..!

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. శరీరంలో పెరుగుతున్న ఊబకాయం కారణంగా అనేక వ్యాధులు చుట్టుముడుతాయని.. అలర్ట్‌గా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Benefits Of Ajwain: వామును ఈ విధంగా తీసుకుంటే వారంలో పొట్ట హాంఫట్.. ఇంకా ఆ అవసరమే ఉండదట..!
Ajwain Water For Weight Loss

Updated on: Oct 31, 2022 | 9:28 PM

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. శరీరంలో పెరుగుతున్న ఊబకాయం కారణంగా అనేక వ్యాధులు చుట్టుముడుతాయని.. అలర్ట్‌గా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో చాలా సార్లు ప్రజలు బరువు తగ్గడానికి ప్రత్యేక ఆహారం తీసుకోవడంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటారు. కానీ.. బరువు మాత్రం తగ్గదు. ఇలా మీరు కూడా బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే ఆహారంలో వామును ఉపయోగించవచ్చని పేర్కొంటున్నారు. మీరు ప్రతిరోజూ వామును తీసుకుంటే జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుందని చెబుతున్నారు. అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌ను వదిలించుకోవడానికి వాము గింజలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు, బెల్లీ ఫ్యాట్‌ తగ్గించడానికి ఈ విధంగా వాము తీసుకోండి..

వాము నీరుః వాము తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ సులభంగా బయటకు వస్తాయి. శరీర జీవక్రియ కూడా వేగవంతం అవుతుంది. వాము నీరు తయారు చేయడానికి అర టీస్పూన్ వాము గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఈ నీటిని ఉదయాన్నే వడగట్టి తాగండి.. ఇలా రోజూ చేయడం వల్ల బరువు పెరగడంతోపాటు పొట్ట కూడా తగ్గుతుంది.

వాము టీః వాము టీ తాగడం ద్వారా బరువు తగ్గడంతో పాటు పొట్ట కొవ్వు కూడా కరిగిపోతుంది. కావున మీరు కూడా బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతుంటే ఇప్పటి నుంచే వాము టీని తీసుకోవచ్చు. వాము టీ తీసుకోవడానికి ఒక గిన్నెలో సగం గ్లాసు నీరు తీసుకోండి.. దానిలో అర టీస్పూన్ వాము వేయండి. ఆ తర్వాత 2 నుంచి 3 నిమిషాలు వేడిచేయండి. ఆ తర్వాత ఈ నీటీని ఫిల్టర్ చేసి తాగాలి.

ఇవి కూడా చదవండి

గోరువెచ్చని నీటితో వాముః వాము ప్రతిరోజూ తీసుకుంటే.. జీర్ణవ్యవస్థను బలపడుతుంది. బరువు తగ్గడానికి వామును నమిలి అర గ్లాసు నీటిని తాగాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా.. ప్రతిరోజూ వామును తీసుకోవడం వల్ల వారంలో రిజల్ట్ కనిపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..