Sleeplessness: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా..? ఇవి ట్రై చేయండి.. క్షణాల్లో నిద్రించేస్తారు..

కొందరైతే చాలా చిన్న వయసులనే బీపీ, షుగర్, కళ్ల సమస్యలు, మధుమేహం, కిడ్నీ సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువకులు ఫోన్ ధ్యాసలో పడి రాత్రివేళ నిద్రపట్టక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే..

Sleeplessness: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా..? ఇవి ట్రై చేయండి.. క్షణాల్లో నిద్రించేస్తారు..
Sleeplessness

Updated on: Apr 08, 2023 | 6:15 AM

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మనలోని చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే కొందరైతే చాలా చిన్న వయసులనే బీపీ, షుగర్, కళ్ల సమస్యలు, మధుమేహం, కిడ్నీ సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువకులు ఫోన్ ధ్యాసలో పడి రాత్రివేళ నిద్రపట్టక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే అందుకు వారు పాటిస్తున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు కూడా ప్రధాన కారణమనే చెప్పుకోవాలి. ఈ పరిస్థితులలో నిద్రలేమి సమస్యకు కారణాలు ఏవైనా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించి, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పు చేస్తే సరిపోతుంది. మరి నిద్రలేమి సమస్యను పరిష్కరించడానికి ఏయే ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పెరుగు: కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఫ్యాట్‌లెస్‌ పెరుగుని తీసుకోవడం వల్ల సుఖ నిద్రపడుతుంది.

ఆకుకూరలు: ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆకుకూరలను తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. సమస్య ఎక్కువగా ఉన్న వారు రెండు రోజులకు ఓసారి ఆకుకూరలని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అరటిపండ్లు: అరటి పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి. అరటిపండులో అధికండా మెగ్నీషియం, పొటాషియం, సూక్ష్మ పోషకాలు ఉండడం వల్ల మన జీర్ణ శక్తి మెరుగు అవుతుంది. తద్వారా హాయిగా నిద్రపడుతుంది.

బాదం: మెగ్నీషియం అధికంగా ఉండే బాదం తినడం వల్ల కూడా హాయిగా నిద్రపడుతుంది. నిద్రిస్తున్న సమయంలో రక్తంలోని చక్కెరస్థాయిని నియంత్రించడంలో కూడా బాదం ఎంతగానో సాయపడుతుంది.

చెర్రీస్: మెలటోనిన్ సమృద్ధిగా ఉండే చెర్రీలు పండ్లను తినడం వల్ల హ్యాపీగా నిద్రపోవచ్చు. వీటిని నేరుగా తీసుకోవచ్చు లేదా జ్యూస్‌లా తాగినా చక్కని ఫలితం ఉంటుంది.

చేపలు: చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. చేపలలో పుష్కలంగా ఉండే పోషకాలే ఇందుకు కారణం. వీటిని తినడం వల్ల హాయిగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ ‌స్టైల్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..