Smile: నవ్వు ఆరోగ్యాన్ని మంచిదని అందరికీ తెలిసిందే.. మరి ఫేక్‌ స్మైల్ వల్ల ఏమవుతుందో తెలుసా.?

|

Oct 30, 2022 | 5:07 PM

నవ్వడం ఒక 'భోగం' నవ్వించడం ఒక 'యోగం' అని చెబుతుంటారు. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు అలాంటివి. నవ్వడం వల్ల మానసిక ఒత్తిడి పారిపోతుంది, నాలుగు రోజులు ఎక్కువగా బతకొచ్చని, నిపుణులు చెబుతుంటారు. అయితే మనస్ఫూర్తిగా నవ్వితేనే ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయని...

Smile: నవ్వు ఆరోగ్యాన్ని మంచిదని అందరికీ తెలిసిందే.. మరి ఫేక్‌ స్మైల్ వల్ల ఏమవుతుందో తెలుసా.?
Fake Smile
Follow us on

నవ్వడం ఒక ‘భోగం’ నవ్వించడం ఒక ‘యోగం’ అని చెబుతుంటారు. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు అలాంటివి. నవ్వడం వల్ల మానసిక ఒత్తిడి పారిపోతుంది, నాలుగు రోజులు ఎక్కువగా బతకొచ్చని, నిపుణులు చెబుతుంటారు. అయితే మనస్ఫూర్తిగా నవ్వితేనే ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయని, లేని నవ్వును మొహానికి అద్దితే ప్రయోజనం శూన్యమని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఏదో ఆశామాషీగా చెప్పడం లేదు. పలు అధ్యయనాల ఆధారంగానే నిపుణులు ఈ విషయాలను వెల్లడించారు.

సాధారణంగా కొన్ని రకాల ఉద్యోగాలు చేసే వారు వారి భావోద్వేగాలు ఎలా ఉన్నా బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తుంటారు. మనసులో ఎన్ని బాధలు, ఆందోళనలు ఉన్నా సరే నవ్వుతూ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఫేక్‌ స్మైల్‌ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జీవన విధానంపై ప్రభావం చూపుతుందిన చెబుతున్నారు. ఆక్యుపేషన్‌ హెల్త్‌ సైకాలజీ అనే జర్నల్‌లో ఈ విషయాలను ప్రస్తావించారు.

నకిలీ నవ్వు (ఫేక్‌ స్మైల్‌) ద్వారా లాభాలు పక్కన పెడితే, నష్టాలే ఎక్కువని చెబుతున్నారు. మనసులో రకరకాల భావోద్వాగాలను దాచుకొని బయటకు నవ్వుతూ ఉండడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. ఇలాంటి ఉద్యోగాలు చేసే వారు వీలైనంత వరకు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, నిత్యం యోగ, మెడిటేషన్‌ వంటి వాటితో మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..