AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ కూరగాయలను తింటున్నారా..? వీటి వల్ల మెదడుకు వచ్చే జబ్బు గురించి మీకు తెలుసా..?

మనం రోజూ తినే కూరగాయల్ని శుభ్రంగా కడగకపోతే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా..? ముఖ్యంగా క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరల్లో టేప్‌ వార్మ్‌ ల క్రిములు దాగి ఉండే అవకాశముంది. ఇవి శరీరంలోకి వెళ్లి మెదడు వరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది.

ఈ కూరగాయలను తింటున్నారా..? వీటి వల్ల మెదడుకు వచ్చే జబ్బు గురించి మీకు తెలుసా..?
Tape Worms In Vegetables
Prashanthi V
|

Updated on: Jul 22, 2025 | 6:06 PM

Share

ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత తో పాటు మంచి పౌష్టికాహారం కూడా తినాలి. ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు మనకు చాలా పోషకాలను ఇస్తాయి. కానీ వాటిలో దాగి ఉన్న పురుగులు, క్రిములు మన ఆరోగ్యానికి ప్రమాదంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కూరగాయల్లో దాగి ఉన్న డేంజర్

క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటి కూరగాయల్లో బయటకు కనిపించకుండా పురుగులు దాగి ఉంటాయి. వీటిని శుభ్రంగా కడగకపోతే ఆ పురుగులు మన శరీరంలోకి చేరి కడుపు సమస్యలు మాత్రమే కాక.. కొన్నిసార్లు మెదడు వరకు వెళ్లి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లను కూడా కలిగిస్తాయి. అందుకే ఈ కూరగాయలను తినే ముందు బాగా ఉడికించడం తప్పనిసరి.

వైద్య నిపుణుల హెచ్చరిక

కొన్ని కూరగాయల్లో టేప్‌ వార్మ్స్ ఎక్కువగా ఉండవచ్చు. ఈ కూరగాయలను సరిగా ఉడికించకుండా తింటే.. ఈ పురుగులు మన మెదడుకు చేరే ప్రమాదం ఉంది. ఆ కూరగాయలు ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఈ కూరగాయలతో జాగ్రత్త

  • కాలీఫ్లవర్.. ఈ కూరగాయలో చిన్న పురుగులు కనిపించకుండా దాగి ఉంటాయి. అవి శరీరంలోకి చేరితే కండరాలు, కాలేయం, మెదడు వరకు చేరే ప్రమాదం ఉంది. అందుకే కాలీఫ్లవర్‌ ను ఉడికించిన నీటిని పారవేసి మాత్రమే వండాలి.
  • వంకాయ.. వంకాయలో కూడా పురుగులు ఎక్కువగా ఉంటాయి. కట్ చేసినప్పుడు క్రిములు కనిపిస్తే.. దాన్ని పూర్తిగా పడేయడం మంచిది. ఎందుకంటే కొన్ని పురుగులు ఉడికించిన తర్వాత కూడా బతికి ఉండే ప్రమాదం ఉంది.
  • బీరకాయ.. ఈ కూరలో చిన్న పురుగులు చాలా వేగంగా పెరిగి కూరను మొత్తం ఆక్రమించగలవు. ఇవి శరీరంలోకి చేరితే మెదడు వరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందుకే బీరకాయను బాగా శుభ్రంగా కడగాలి.
  • క్యాబేజీ.. ఇది పొరలు పొరలుగా ఉండటం వల్ల టేప్‌ వార్మ్‌ లకు మంచి నివాసంగా మారుతుంది. ఈ క్రిముల గుడ్లు మన శరీరంలోకి వెళ్లి మెదడు వరకు వెళ్తాయి. అందుకే క్యాబేజీని ఉడికించి వాడటం తప్పనిసరి.
  • చామదుంప ఆకులు.. ఈ ఆకుల్లో కూడా టేప్‌ వార్మ్ గుడ్లు దాగి ఉంటాయి. కడగకుండా తిన్నట్లయితే వాంతులు, కడుపు నొప్పులు, జీర్ణ సమస్యలతో పాటు మెదడు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ప్రతి ఆకును విడివిడిగా శుభ్రంగా కడగాలి.
  • క్యాప్సికం.. క్యాప్సికం లోపల గింజల దగ్గర క్రిముల గుడ్లు దాగి ఉండే అవకాశం ఉంది. అందుకే గింజలు తీసేసి బాగా కడిగిన తర్వాతే వాడాలి.
  • పర్వల్ (Pointed gourd).. పర్వల్ కూడా టేప్‌ వార్మ్స్ సోకే ప్రమాదం ఉన్న కూరగాయ. కృత్రిమ ఎరువులు, పురుగుమందులతో పెంచిన కాయల్లో క్రిముల గుడ్లు ఉండే అవకాశముంది. వీటిని శుభ్రంగా కడగకపోతే మలబద్ధకం, తలనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

భూమిలోంచి శరీరంలోకి..

ఈ టేప్‌ వార్మ్స్ ఎక్కువగా పందుల మూత్రం ద్వారా భూమిలోకి వస్తాయి. అక్కడి నుండి అవి కూరగాయల్లోకి చేరతాయి. ముఖ్యంగా భూమికి దగ్గరగా పెరిగే క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర, బీన్స్, క్యారెట్ వంటి వాటిలో ఈ పురుగులు ఉండే ప్రమాదం ఎక్కువ.

ముందు జాగ్రత్తలే మనకు రక్షణ

టేప్‌ వార్మ్స్ వల్ల గుండె ఆగిపోవడం, తలనొప్పులు, పక్షవాతం, న్యూరోసిస్టిసర్కోసిస్ (మెదడుకు వచ్చే జబ్బు) లాంటి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల చూడటానికి బాగున్న కూరగాయల్లో దాగి ఉన్న ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే వాటిని బాగా శుభ్రంగా కడగడం.. పూర్తిగా ఉడికించడం అలవాటు చేసుకోవాలి.

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. అందుకే ఎలాంటి కూరగాయ అయినా వండే ముందు శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రత్యేకంగా ముదురు ఆకుపచ్చ కూరగాయల్ని తినే ముందు శుభ్రంగా కడగడం ద్వారా పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.