World Animal Day 2021: ఈ 5 జంతువులు అంతరించిపోతున్నాయి..! అందుకే ఇప్పుడే చూడండి..

| Edited By: Ravi Kiran

Oct 04, 2021 | 6:32 AM

World Animal Day 2021: ఈ భూమిపై ప్రతి ఒక్క జీవరాశికి బతికే హక్కు ఉంది. దానిని ఎవ్వరూ కాదనలేరు. ప్రాచీనకాలం నుంచి మనుషులతో పాటు జంతువులు, పశు పక్షాదులు

World Animal Day 2021: ఈ 5 జంతువులు అంతరించిపోతున్నాయి..! అందుకే ఇప్పుడే చూడండి..
Rhinocores
Follow us on

World Animal Day 2021: ఈ భూమిపై ప్రతి ఒక్క జీవరాశికి బతికే హక్కు ఉంది. దానిని ఎవ్వరూ కాదనలేరు. ప్రాచీనకాలం నుంచి మనుషులతో పాటు జంతువులు, పశు పక్షాదులు ఉన్నాయి. కానీ కాలక్రమేణా కొన్ని జీవుల ఉనికి అంతరించిపోతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని మనుషులు చేసే చర్యల వల్ల అయితే మరికొన్ని ప్రకృతి సృష్టించే విపత్తుల వల్ల కావొచ్చు. అయితే మానవుడిగా మనతో పాటు బతికే జీవరాశులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ రోజు ప్రపంచ జంతు దినోత్సవం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 4 న జరుపుకుంటారు. ప్రస్తుతం అంతరించిపోయే 5 జంతువుల గురించి తెలుసుకుందాం.

1. బెంగాల్ టైగర్
పులి భారతదేశ జాతీయ జంతువు. రాయల్ బెంగాల్ టైగర్‌ అద్భుతమైన పులి జాతులలో ఒకటి. 550 పౌండ్ల బరువుతో10 అడుగుల పొడవైన శరీరాకృతి కలిగిన అతిపెద్ద అడవి పిల్లులలో ఇది ఒకటి. సుందర్‌బన్స్ నేషనల్ పార్క్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని రణతంబోర్ నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్‌లో కూడా చూడవచ్చు.

2. మొసలి
భారతదేశంలో కనిపించే మూడు మొసళ్లలో ఘరియల్ ఒకటి. ఇవి ఎక్కువగా గంగా నదిలో కనిపిస్తాయి. చంబల్, బ్రహ్మపుత్ర నదులలో కూడా ఉంటాయి. ఘరియల్ జాతి మొసలి భారతదేశంలో అత్యంత ప్రమాదంలో ఉన్న జాతులలో ఒకటిగా పరిగణిస్తున్నారు. కలుషిత నీటి కారణంగా వీటి మరణాలు ఎక్కువవుతున్నాయి.

3. ఏషియాటిక్ సింహం
ఏషియాటిక్ సింహం ప్రపంచంలోనే అతిపెద్ద సింహాలలో ఒకటి. ఈ సింహాలు ఇప్పుడు భారతదేశంలో మాత్రమే కనిపిస్తున్నాయి. గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్కులో వీటిని చూడవచ్చు. 2010 నుంచి వీటి జాతి తగ్గుతున్న క్రమంగా అంతరించిపోయే లిస్టులో చేర్చారు. 2020 లెక్కల ప్రకారం దేశంలో మిగిలి ఉన్న ఆసియా సింహాల సంఖ్య 674 మాత్రమే.

4. రెడ్ పాండా
తూర్పు హిమాలయాలకు చెందిన ఎర్రని గోధుమ రంగు ఎర్బోరియల్ క్షీరదం రెడ్ పాండా. వేట కారణంగా వేగంగా క్షీణిస్తున్న మరొక జాతి. దీనిని సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని ఖాంగ్‌చెండ్‌జోంగా, నామదఫా జాతీయ ఉద్యానవనాలలో చూడవచ్చు.

5. ఒక కొమ్ము గల ఖడ్గమృగం
ఒక కొమ్ము గల ఖడ్గమృగం కొన్ని సంవత్సరాలుగా కనుమరుగవుతున్నాయి. ఈ భారతీయ జంతువులు కాజీరంగా జాతీయ ఉద్యానవనం, దుధ్వా టైగర్ రిజర్వ్, పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం, భారతదేశం, నేపాల్‌లోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో చూడవచ్చు.

Lakhimpur Kheri clash: ‘నా కొడుకు కారులో లేడు.. ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కొట్టి చంపారు’ : కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా

Lakhimpur Kheri clash: లఖింపూర్ ఖేరీ ఘటన దురదృష్టకరం.. బాధ్యులపై కఠిన చర్యలు : సీఎం యోగి ఆదిత్యానాధ్‌