లోకేష్‌కి “రేర్ డిసీజ్”.. : విజయసాయిరెడ్డి ట్వీట్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి నారాలోకేష్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి ఒక స్కామ్‌ల పుట్ట అని గుర్తించే ప్రపంచ బ్యాంకు 3500 కోట్ల రుణాన్ని నిలిపి వేసిందని ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్‌కు మేలు చేసేదిగా ఉండటం, రుణం ఇవ్వకుండానే 92 కిమీ రోడ్డుకు 1872 కోట్ల అంచనాలతో టెండర్లు ఆమోదించడం అతి పెద్ద కుంభకోణంగా బ్యాంకు దర్యాప్తులో వెల్లడైందని వివరించారు. లోకేష్‌ను టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు […]
![లోకేష్‌కి రేర్ డిసీజ్.. : విజయసాయిరెడ్డి ట్వీట్](https://images.tv9telugu.com/wp-content/uploads/2019/07/Lokesh-Vs-Vijay.png?w=1280)
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి నారాలోకేష్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి ఒక స్కామ్‌ల పుట్ట అని గుర్తించే ప్రపంచ బ్యాంకు 3500 కోట్ల రుణాన్ని నిలిపి వేసిందని ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్‌కు మేలు చేసేదిగా ఉండటం, రుణం ఇవ్వకుండానే 92 కిమీ రోడ్డుకు 1872 కోట్ల అంచనాలతో టెండర్లు ఆమోదించడం అతి పెద్ద కుంభకోణంగా బ్యాంకు దర్యాప్తులో వెల్లడైందని వివరించారు. లోకేష్‌ను టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘తామే సర్వజ్ఞానులమని, అన్యులంతా అజ్ఞానులని భావించేవారు అభిజ్ఞా పక్షపాతంతో ఉంటారని సైకాలజీ చెబుతోంది. దీనిని డన్నింగ్-క్రుగర్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. లోకేశ్ సమస్య కూడా ఇదే. తండ్రి చాలా కాలం అధికారంలో ఉండటం. ఒక్కడే సంతానం కావడం వల్ల ఈ వ్యాధికి లోనై ఉండవచ్చు’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
తామే సర్వజ్ఞానులమని, అన్యులంతా అజ్ఞానులని భావించేవారు Cognitive Bias (అభిజ్ఞా పక్షపాతం)తో ఉంటారని సైకాలజీ చెబుతోంది. దీనిని Dunning-Kruger effect అని పిలుస్తారు. లోకేశ్ సమస్య కూడా ఇదే. తండ్రి చాలా కాలం అధికారంలో ఉండటం. ఒక్కడే సంతానం కావడం వల్ల ఈ వ్యాధికి లోనై ఉండవచ్చు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 22, 2019
అమరావతి ఒక స్కామ్‌ల పుట్ట అని గుర్తించే ప్రపంచ బ్యాంకు 3500 కోట్ల రుణాన్ని నిలిపి వేసింది. రియల్ ఎస్టేట్‌కు మేలు చేసేదిగా ఉండటం, రుణం ఇవ్వకుండానే 92 కిమీ రోడ్డుకు 1872 కోట్ల అంచనాలతో టెండర్లు ఆమోదించడం అతి పెద్ద కుంభకోణంగా బ్యాంకు దర్యాప్తులో వెల్లడైంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 22, 2019