మంత్రి పదవి ఇప్పుడు రాలేదు.. అప్పుడైనా వస్తుందనుకుంటున్నా: కాటసాని
సీనియర్ నాయకుడిగా తనకు మంత్రి పదవి రాలేదని కార్యకర్తల్లో ఆవేదన ఉందని పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని అన్నారు. అయితే రెండున్నరేళ్ల తరువాతైనా తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి వర్గ కూర్పు చూశాక బీసీ, ఎస్సీ, ఎస్టీగా ఎందుకు పుట్టలేదనిపించిందని ఆయన పేర్కొన్నారు. అయితే వైఎస్సార్ పాలన కన్నా జగన్ పాలన గొప్పగా ఉండబోతుందని కాటసాని ధీమా వ్యక్తం చేశారు. అయితే గత 40ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కాటసాని […]
సీనియర్ నాయకుడిగా తనకు మంత్రి పదవి రాలేదని కార్యకర్తల్లో ఆవేదన ఉందని పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని అన్నారు. అయితే రెండున్నరేళ్ల తరువాతైనా తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి వర్గ కూర్పు చూశాక బీసీ, ఎస్సీ, ఎస్టీగా ఎందుకు పుట్టలేదనిపించిందని ఆయన పేర్కొన్నారు. అయితే వైఎస్సార్ పాలన కన్నా జగన్ పాలన గొప్పగా ఉండబోతుందని కాటసాని ధీమా వ్యక్తం చేశారు. అయితే గత 40ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కాటసాని వివిధ పార్టీల తరఫున ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఇంతవరకు ఆయన మంత్రి పదవి చేపట్టలేదు. ఇప్పుడు జగన్ హయాంలో ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించినప్పటికీ.. రాకపోవడంతో ఆయన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.