మానవత్వాన్ని చాటుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. ప్రశంసించిన స్థానికులు..

YSRCP MLA Gopireddy: గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. స్వతహాగా డాక్టరైన ఆయన.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకులకు ప్రాధమిక చికిత్సను అందించి 108 అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మంగళవారం చిలకలూరిపేట- విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. కళ్లెం టెక్స్‌టైల్స్‌ వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక […]

  • Ravi Kiran
  • Publish Date - 7:37 pm, Wed, 15 July 20
మానవత్వాన్ని చాటుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. ప్రశంసించిన స్థానికులు..

YSRCP MLA Gopireddy: గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. స్వతహాగా డాక్టరైన ఆయన.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకులకు ప్రాధమిక చికిత్సను అందించి 108 అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మంగళవారం చిలకలూరిపేట- విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. కళ్లెం టెక్స్‌టైల్స్‌ వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక అదే మార్గంలో గుంటూరు వెళ్తున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి.. తన కారును సంఘటనాస్థలంలో ఆపి.. స్థానికుల సాయంతో యువకులకు ప్రాధమిక చికిత్సను అందించారు. ఆ తర్వాత 108కి సమాచారం అందించి వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఎమ్మెల్యే స్పందించిన తీరుకు అక్కడి జనం ఆయనపై ప్రశంసలు కురిపించారు.

Also Read:

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. జగన్ సర్కార్ సంచలనం..

పవన్‌ను పొగుడుతూ అలీ ట్వీట్.. జనసైనికులు ఆగ్రహం..

”వందేళ్ల జీవితం మార్కుల కంటే విలువైనది”.. ఐఏఎస్ సూపర్బ్ ట్వీట్..

డిజిటల్ వార్.. చైనాకు మరో భారీ షాక్.. హువావేపై నిషేధం..