ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం..ఏసీబీ డీజీ స్థాన చలనం

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏసీబీ డీజీగా పనిచేస్తోన్న కుమార్ విశ్వజిత్‌ ఉన్నఫలంగా ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆయన్ను వెంటనే డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక విశ్వజిత్ ప్లేసులో..ఇప్పటివరకు రవాణాశాఖ కమిషనర్ పనిసచేస్తోన్నసీతారామాంజనేయులును ఏసీబీ డైరెక్టర్ జనరల్‌ నియమిస్తూ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. ఆయన ఏపీపీఎస్సీ కార్యదర్శిగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇటీవలే ఏసీబీపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పని విషయంలో […]

ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం..ఏసీబీ డీజీ స్థాన చలనం

Updated on: Jan 04, 2020 | 8:48 PM

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏసీబీ డీజీగా పనిచేస్తోన్న కుమార్ విశ్వజిత్‌ ఉన్నఫలంగా ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆయన్ను వెంటనే డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక విశ్వజిత్ ప్లేసులో..ఇప్పటివరకు రవాణాశాఖ కమిషనర్ పనిసచేస్తోన్నసీతారామాంజనేయులును ఏసీబీ డైరెక్టర్ జనరల్‌ నియమిస్తూ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. ఆయన ఏపీపీఎస్సీ కార్యదర్శిగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇటీవలే ఏసీబీపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పని విషయంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమీక్ష జరిగి రెండు రోజులు కూడా ముగియకుండానే ఏసీబీ డీజీపై వేటు వేయడం..అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.