ముస్లిం సోదరులకు ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

|

Jun 05, 2019 | 6:51 AM

ఏపీ రాష్ట్రానికి, ప్రజలకు అల్లా దయ ఎల్లప్పుడూ ఉండాలి – జగన్  రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. దీక్షలు, ఉపవాసాలు దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా భగవంతుని స్మరణలో ఈ రంజాన్ ప్రజలకు సుఖసంతోషాలు కల్గించాలని సీఎం ఆకాంక్షించారు. ఏపీ రాష్ట్రానికి, ప్రజలకు అల్లా దయ ఎల్లప్పుడూ ఉండాలని జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. ముస్లిం సోదరులు స్నేహానికి […]

ముస్లిం సోదరులకు ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ
Follow us on

ఏపీ రాష్ట్రానికి, ప్రజలకు అల్లా దయ ఎల్లప్పుడూ ఉండాలి – జగన్ 

రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. దీక్షలు, ఉపవాసాలు దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా భగవంతుని స్మరణలో ఈ రంజాన్ ప్రజలకు సుఖసంతోషాలు కల్గించాలని సీఎం ఆకాంక్షించారు. ఏపీ రాష్ట్రానికి, ప్రజలకు అల్లా దయ ఎల్లప్పుడూ ఉండాలని జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.

ముస్లిం సోదరులు స్నేహానికి మారుపేరు – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లా దయతో ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ముస్లిం సోదరులకు  రంజాన్  చెబుతూ.. నెలరోజులు భక్తితో ఉపవాసం చేసిన ముస్లిం సహోదరుల ఆకాంక్షలు సఫలం అవ్వాలని కోరుకున్నారు. ముస్లిం సోదరులు స్నేహానికి మారుపేరని, సమాజంలో స్నేహ, సౌహార్ధ సంబంధాల కోసం అందరూ కృషి చేయాలని కోరారు.

ముస్లిం సోదరులకు పవన్, రఘువీరా శుభాకాంక్షలు..

రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సర్వ మానవాళి స్నేహ సౌభ్రాతృత్వానికి రంజాన్ ప్రతీకని వారు పేర్కొన్నారు.