‘టిక్ టాక్’ తీసిన ప్రాణం..

| Edited By:

Jun 24, 2019 | 11:59 AM

టిక్‌టాక్ క్రేజ్ ఓ యువకుడ్ని బలితీసుకుంది. సాహసం చేయాలనుకుని.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. రిస్కీ స్టంట్ చేశాడు.. చివరకు బెడిసి కొట్టి ఆస్పత్రిపాలయ్యాడు. వారం రోజులు.. మృత్యువుతో పోరాడి.. చివరకు ఓడిపోయాడు. బెంగళూరుకు చెందిన కుమార్ ఐసీయూలో చికిత్స పొందుతూ చనిపోయాడు. వారం రోజుల కిందట కుమార్ అనే యువకుడు టిక్‌టాక్ వీడియో కోసం రిస్కీ స్టంట్ చేశాడు. ఓ యువకుడి సహాయంతో ట్రై చేయబోయి.. ఫెయిల్ అయ్యాడు. మెడ దగ్గర ల్యాండ్ కావడంతో బ్రోన్స్ బ్రేక్ […]

టిక్ టాక్ తీసిన ప్రాణం..
Follow us on

టిక్‌టాక్ క్రేజ్ ఓ యువకుడ్ని బలితీసుకుంది. సాహసం చేయాలనుకుని.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. రిస్కీ స్టంట్ చేశాడు.. చివరకు బెడిసి కొట్టి ఆస్పత్రిపాలయ్యాడు. వారం రోజులు.. మృత్యువుతో పోరాడి.. చివరకు ఓడిపోయాడు. బెంగళూరుకు చెందిన కుమార్ ఐసీయూలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

వారం రోజుల కిందట కుమార్ అనే యువకుడు టిక్‌టాక్ వీడియో కోసం రిస్కీ స్టంట్ చేశాడు. ఓ యువకుడి సహాయంతో ట్రై చేయబోయి.. ఫెయిల్ అయ్యాడు. మెడ దగ్గర ల్యాండ్ కావడంతో బ్రోన్స్ బ్రేక్ అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. కానీ వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన కుమార్ చివరకు చనిపోయాడు. టిక్‌టాక్‌ క్రేజ్‌తో తన బిడ్డ చనిపోయాడంటూ కుమార్ ఫ్యామిలీ కన్నీరు మున్నీరవుతోంది.