Women Driver: తండ్రికోసం ఆటో డ్రైవర్‌గా మారిన కూతురు… ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోన్న యువతి..
Young Women Became Auto Driver: మహిళలు పురుషులతో సమానంగా దూసుకెళుతున్నారు. రంగంతో సంబంధం లేకుండా అన్ని విభాగాల్లో తమకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటున్నారు...
Young Women Became Auto Driver: మహిళలు పురుషులతో సమానంగా దూసుకెళుతున్నారు. రంగంతో సంబంధం లేకుండా అన్ని విభాగాల్లో తమకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటున్నారు. పురుషులతో పోటీపడుతూ నారీమణుల శక్తిని ప్రపంచానికి చాటిచెబుతోన్న సంఘటనలు ఎన్నో మనకు అడపాదడపా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఓ 21 ఏళ్ల యువతి ఏకంగా ఆటో డ్రైవర్‌గా మారి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. జమ్మూ కశ్మీర్‌కు చెందిన 21 ఏళ్ల బంజీత్ కౌర్ స్థానికంగా విద్యనభ్యసిస్తోంది. అయితే ఓ వైపు చదుకుంటూనే మరోవైపు పార్ట్‌టైమ్‌గా ఆటో నడుపుతోంది. అసలు తాను ఆటో డ్రైవర్‌గా మారడానికి గల కారణాన్ని బంజీత్ ఇలా చెప్పుకొచ్చింది. ‘మా నాన్న ఒక స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. కానీ కరోనా కారణంగా ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో అతను ఆటోరిక్షా తోలడం మొదలు పెట్టాడు. కానీ ఆశించిన స్థాయిలో ఆదాయం మాత్రం రావట్లేదు… ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో నేనూ కూడా ఆటో నడపాలని నిర్ణయించుకున్నాను. నేను ప్రస్తుతం నా విద్యను కొనసాగిస్తూనే పార్టటైమ్‌గా ఆటో తోలుతున్నాను. దీని ద్వారా నాన్నకు కొంచమైనా సహాయపడగలనని నా అభిప్రాయం. మహిళలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి’ అని చెప్పుకొచ్చింది. ఇక కుటుంబానికి చేదోడుగా నిలుస్తోన్న బంజీత్‌పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
21 year old Banjeet Kaur from Udhampur breaks societal barriers to become an auto driver in order to support her family after her father lost his job amid the COVID-19 pandemic.
VIDEO https://t.co/LzHKvovbva
YT: https://t.co/R65bY09JeU |
— Ajay Criminologist (@JKCriminologist) January 12, 2021