బాలికపై ప్రేమోన్మాది దాడి
వరంగల్ జిల్లాలో ఓ ప్రమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను కాదనందుకు బీరు సీసాతో మైనర్ బాలికపై దాడి చేశాడు. గాయపడ్డ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
వరంగల్ జిల్లాలో ఓ ప్రమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను కాదనందుకు బీరు సీసాతో మైనర్ బాలికపై దాడి చేశాడు. గాయపడ్డ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వరంగల్ అర్బన్ జిల్లాలో 11వ డివిజన్ క్రిస్టియన్ కాలనీకి చెందిన బసికె నిఖిల్ 10వ డివిజన్ అబ్బనికుంటకి చెందిన మైనర్ బాలికను కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. ఆ యువకుడి మాయమాటలు నమ్మని బాలిక దూరంగా ఉంటూ వస్తుంది. అయినా ఆమెను ప్రేమిస్తున్నంటూ వేధించడం మొదలుపెట్టాడు. అతని నుంచి తప్పించుకు తిరుగుతుండడంతో కోపం పెంచుకున్న నిఖిల్ ఏకంగా బాలికి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను నిలదీశాడు. బాలిక ప్రేమను అంగీకరించనని తేల్చి చెప్పడంతో బీరు సీసాతో బాలికపై దాడి చేశాడు. బాలిక తప్పించుకోవడంతో చేతిపై తీవ్రగాయాలయ్యాయి. ఆమె అరుపులు విని స్థానికులు అక్కడికి చేరడంతో నిఖిల్ తప్పించుకు పారిపోయాడు. గాయపడ్డ బాలికను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.