ట్రిపుల్ తలాఖ్ బాధితులకు పింఛన్..ప్రభుత్వం సంచలన నిర్ణయం

|

Dec 29, 2019 | 12:45 PM

ట్రిపుల్ తలాఖ్ బాధిత మహిళలకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  ఏడాదికి రూ.6000 పింఛన్‌గా ఇచ్చి..వారికి పునారావాసం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. వీరితో  పాటు భర్తల నుంచి విడాకులు పొందిన ఇతర మతాల మహిళలకు సైతం పింఛన్‌ను అందించనుంది. ఇక తలాఖ్ బాధిత మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు సైతం యూపీ సర్కార్ ముందుకొచ్చింది. వచ్చే ఏడాది నుంచి ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక ప్రభుత్వం నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం […]

ట్రిపుల్ తలాఖ్ బాధితులకు పింఛన్..ప్రభుత్వం సంచలన నిర్ణయం
Follow us on

ట్రిపుల్ తలాఖ్ బాధిత మహిళలకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  ఏడాదికి రూ.6000 పింఛన్‌గా ఇచ్చి..వారికి పునారావాసం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. వీరితో  పాటు భర్తల నుంచి విడాకులు పొందిన ఇతర మతాల మహిళలకు సైతం పింఛన్‌ను అందించనుంది. ఇక తలాఖ్ బాధిత మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు సైతం యూపీ సర్కార్ ముందుకొచ్చింది. వచ్చే ఏడాది నుంచి ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

ఇక ప్రభుత్వం నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ అవసరాల కోసం యోగీ ప్రయత్నిస్తున్నారని కొందరు ఆరోపిస్తూ ఉండగా,  ప్రభత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మరికొందరు చెప్తున్నారు. అయితే ఏడాదికి రూ 6000 అంటే నెలకు కేవలం రూ 500 మాత్రమే అందుతుందని..ఆ మొత్తం వారి అవసరాలకు సరిపోదంటూ ముస్లిం బోర్డులకు చెందిన పెద్దలు మరికొన్ని సూచనలు చేస్తున్నారు. బాధిత మహిళల పిల్లలకు చదువు చెప్పించడం, నివాస గృహాలను ఏర్పాటు చెయ్యడం ద్వారా ప్రభుత్వం వారి స్వాంతనకు కృషి చేసినట్లు అవుతుందని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.