మరికొన్ని గంటల్లో విడుదల కాబోతోన్న ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయకేతనం ఎగురేయాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు ఎమ్మెల్యే రోజా. వైసీపీ శ్రేణులతో పాటు, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా సంబరాలు చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారని ఆమె అన్నారు. రేపటి ఫలితాల్లో దర్శనం అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. లగడపాటి సర్వేలు తప్పుడు సర్వేలని విమర్శించారు.
కర్నాటక, తమిళనాడు, తెలంగాణాలో లగడపాటి సర్వేలు తలకిందులయ్యాయని రోజా అన్నారు. ఇక నగరి నియోజకవర్గానికి రెండోసారి మంచి మెజార్టీతో తాను ఎమ్మెల్యే కాబోతున్నట్లు రోజా ధీమా వ్యక్తం చేశారు. గడచిన ఐదేళ్లలో తన కుటుంబాన్ని, హెరిటేజ్ కంపెనీని అభివృద్ధి చేసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారని రోజా విమర్శించారు.