చంద్రబాబు ‘ఆ’ పని చేయలేదు.. అందుకే బిజెపికి : సాధినేని యామిని

|

Nov 08, 2019 | 6:02 PM

గురువారం నాడు టిడిపికి రాజీనామా చేసిన సాధినేని యామిని శర్మ తాను బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం విజయవాడకు వస్తున్న బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి.నడ్డా సమక్షంలో బిజెపి కండువా కప్పుకుంటున్నానని ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే.. ఈ సందర్భంగా యామిని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గత అయిదేళ్ళుగా టిడిపికి మౌత్ పీస్‌లా మారి మీడియా వేదికలలో పార్టీ గళాన్ని వినిపించిన యామిని యావత్ తెలుగు ప్రజలందరి సుపరిచితులయ్యారు. చంద్రబాబే తనకు ఆదర్శం.. తన అభిమాన నాయకుడు […]

చంద్రబాబు ‘ఆ’ పని చేయలేదు.. అందుకే బిజెపికి : సాధినేని యామిని
Follow us on

గురువారం నాడు టిడిపికి రాజీనామా చేసిన సాధినేని యామిని శర్మ తాను బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం విజయవాడకు వస్తున్న బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి.నడ్డా సమక్షంలో బిజెపి కండువా కప్పుకుంటున్నానని ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే.. ఈ సందర్భంగా యామిని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

గత అయిదేళ్ళుగా టిడిపికి మౌత్ పీస్‌లా మారి మీడియా వేదికలలో పార్టీ గళాన్ని వినిపించిన యామిని యావత్ తెలుగు ప్రజలందరి సుపరిచితులయ్యారు. చంద్రబాబే తనకు ఆదర్శం.. తన అభిమాన నాయకుడు అని తరచూ చెప్పే యామిన.. పార్టీని వీడుతూ కూడా అదే మాట వల్లె వేశారు. కాకపోతే.. తానడిగిన ఓ పని చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని, ఆయన తానడిగిన ఆ పని చేయకపోవడం వల్లనే పార్టీని వీడుతున్నానని యామిని క్లియర్ కట్‌గా వెల్లడించారు.

చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపిన తర్వాత టీవీ9 ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యామిని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తనతోపాటు ఏపీలోని 13 జిల్లాలకు చెందిన నేతలు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారని ఆమె చెప్పారు. ఈ దేశానికి మోడీ నాయకత్వం అవసరమని తాను భావిస్తున్నానని, తనకు బీజేపీ విధానాలు నచ్చాయని ఆమె వివరించారు.

2014 నుంచి టిడిపి లో క్రియాశీలకంగా పని చేస్తున్నానని, చంద్రబాబే తన అభిమాన నాయకుడని తెలిపిన యామిని.. టిడిపిలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా ఎలాంటి జంకు లేకుండా వెల్లడించారు. టిడిపిలో అంతర్గత విభేదాల తాను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారామె. తాను ఎదుర్కొన్న సమస్యలపై అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్ళినా కూడా ఆయన స్పందించలేదని, తనకు పార్టీలో నాకు మద్దతు లభించలేదని యామిని వాపోయారు.

తనను ఇబ్బందులు పెడుతున్న వారిపై చర్య తీసుకోవాలంటూ తాను చేసిన విఙ్ఞప్తిని చంద్రబాబు పట్టించుకోలేదని, ఆ పని చేసి వుంటే బహుశా తాను టిడిపిని వీడి వుండే దానిని కాదని యామిని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో టిడిపిలోని లోపాలను కూడా యామిని కుండబద్దలు కొట్టారు. బీజేపీని, మోడీని వ్యతిరేకించడం టిడిపికి నష్టం కలిగించిందని, ప్రత్యేక హోదా విషయంలో టిడిపి వైఖరి సరిగ్గా లేదని జరిగిన తప్పిదాలపై విస్పష్టంగా మాట్లాడారు యామిని. దేశంలో ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్ లేదని, ప్రాంతీయ పార్టీల్లో కుల, వారసత్వ రాజకీయాలు పెరిగాయని చంద్రబాబుకు పరోక్షంగా చురకంటించారు యామిని. తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోవడం వల్లనే పార్టీని వీడుతున్నానని అనడం కరెక్టు కాదని యామిని అంటున్నారు.