ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య ఎంతో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం శుక్రవారం నాటికి ప్రపంచవ్యాప్త మరణాలు 4లక్షలు దాటాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య ఎంతో తెలుసా?
Follow us

|

Updated on: Jun 05, 2020 | 8:45 PM

ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా రాకాసి రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు వ్యాక్సిన్స్ అందుబాటులోకి రాకపోవడంతో మరణాలు సంఖ్య కూడా మెల్ల మెల్లగా ముందుకు కదులుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ అల్లుకుంటోంది కరోనా. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం శుక్రవారం నాటికి ప్రపంచవ్యాప్త మరణాలు 4లక్షలు దాటాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు రష్యా, బ్రెజిల్ దేశాల్లో అత్యధిక మరణాలు నమోదవుతున్నాయి. కరోనా కేసులు, మరణాల్లో అమెరికానే అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బ్రెజిల్‌, రష్యాలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కోవిడ్‌-19 బాధితుల సంఖ్య 6,740,320కు చేరింది. కరోనా పాజిటివ్‌ కేసుల్లో అమెరికా 1,926,269 కేసులు, బ్రెజిల్‌ 6,18,554, రష్యా 4,49,834 , స్పెయిన్‌ 2,87,740, బ్రిటన్‌ 2,81,661) ఇటలీ 2,34,013 కేసు నమోదయ్యాయి. ఇక మన దేశంలో ఇప్పటి వరకూ 2,30,113 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా జర్మనీలో 84,923, పెరూ 1,83,198) టర్కీ1,67,410 టాప్‌-10లో నిలిచాయి. ఇక కరోనా మరణాలు అత్యధికంగా ఉన్నదేశాలను పరిశీలిస్తూ.. అమెరికాలో ఇప్పటి వరకు 1,10,255 కరోనా ధాటికి బలయ్యారు. బ్రిటన్‌లో 39,904 మంది, బ్రెజిల్‌ 34,072 మంది, ఇటలీ 33,689 మంది, ఫ్రాన్స్‌లో 29,065 మంది, స్పెయిన్‌ 27,133 మంది చనిపోయారు. ఇక మెక్సికో 12,545 మంది, జర్మనీ 8,736 మంది, ఇరాన్‌ 8,134 మంది, కెనడా 7,637 మంది మృతి చెందారు. ఇక భారత్ లో ఇప్పటి శుక్రవారం నాటికీ 6,393 కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే దేశంలో నమోదు అవుతున్న డిశ్చార్జీ సంఖ్యను బట్టి చూస్తే మన దేశంలో కోలుకున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

Latest Articles
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?