Divorce Rate: వైవాహిక జీవితానికి బలం చేకూర్చిన భారత్.. విడాకులు తీసుకునే దేశాల్లో నంబర్ వన్ స్థానంలో పోర్చుగల్

మనదేశంలో వివాహ వ్యవస్థ అత్యంత గొప్పది. పెళ్లంటే నూరేళ్ల పంట అని చెప్పేవారు మన పెద్దలు. కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడు భారతదేశంలో మినహా ప్రపందేశాల్లో ఎక్కడా కనిపించడం లేదు. పెళ్లైతే చేసుకుంటున్నారు కానీ.. ఆ దాంపత్య వ్యవస్థను పెద్ద అవస్థగా భావిస్తున్నారు నేటి తరం. దీనికి కారణాలు ఏవైనా విడాకులు తీసుకోవడం మాత్రం పక్కా. ఇటీవల వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చేసిన అధ్యయనంలో ప్రపంచ దేశాల్లో డివోర్స్ రేటు ఎలా ఉందో వెల్లడించింది.

Divorce Rate: వైవాహిక జీవితానికి బలం చేకూర్చిన భారత్.. విడాకులు తీసుకునే దేశాల్లో నంబర్ వన్ స్థానంలో పోర్చుగల్
World Of Statistics Reveals How The Divorce Rate Is In The Countries Of The World

Updated on: Nov 02, 2023 | 11:04 AM

మనదేశంలో వివాహ వ్యవస్థ అత్యంత గొప్పది. పెళ్లంటే నూరేళ్ల పంట అని చెప్పేవారు మన పెద్దలు. కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడు భారతదేశంలో మినహా ప్రపందేశాల్లో ఎక్కడా కనిపించడం లేదు. పెళ్లైతే చేసుకుంటున్నారు కానీ.. ఆ దాంపత్య వ్యవస్థను పెద్ద అవస్థగా భావిస్తున్నారు నేటి తరం. దీనికి కారణాలు ఏవైనా విడాకులు తీసుకోవడం మాత్రం పక్కా. ఇటీవల వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చేసిన అధ్యయనంలో ప్రపంచ దేశాల్లో డివోర్స్ రేటు ఎలా ఉందో వెల్లడించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

పెళ్లి చేసుకునేందుకు ఇప్పటి తరం వారు జంకుతున్నారు. కారణం తమ వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోతామని కొందరు, సంసార బాధ్యతలు భరించలేమని మరి కొందరు, తమ ఎదుగుదలకు ఆటంకంగా భావించి, సంపాదన, ఖర్చులను దృష్టిలో ఉంచుకుని దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టేందుకు సంకోచిస్తున్నారు. మనం ఎంతో గోప్పగా భావించే వివాహ వ్యవస్థ ప్రపంచ దేశాల్లో చాలా హీన పరిస్థితుల్లో ఉంది. అధిక శాతం మంది విడాకులు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కానీ భారతదేశం మాత్రం మొత్తం పెళ్లైన జంటల్లో ఒక్కశాతం మంది మాత్రమే విడాకులు తీసుకుంటున్నట్లు తేల్చింది. దీనిని బట్టి మన ఇండియాలో వైవాహిక బంధం ఎంత బలంగా కొనసాగుతుంతో చెప్పవచ్చు.

World Of Statistics Reveals Divorce Rate

వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం.. వియత్నాంలో 7%, తజికిస్తాన్‌లో 10%, ఇరాన్‌లో 14% ఉండగా.. అత్యధికంగా పోర్చుగల్‌లో 94% నమోదైంది. ఇదే ప్రపంచంలో అన్ని దేశాల కంటే అధికంగా విడాకులు తీసుకుంటున్న దేశంగా రికార్డ్ స్థాయిలో నిలిచింది. ఇక స్పెయిన్ 84%తో రెండవ స్థానంలో ఉండగా.. లక్సెంబర్గ్ 79%తో మూడవ స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో రష్యా 73%, ఉక్రెయిన్ 70%, క్యూబా 55%, ఫిన్‌లాండ్ 55%, అమెరికా 45%, చైనా 44%, యునైటెడ్ కింగ్‌డమ్ 41 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..