మరిన్ని మహమ్మారులకు సిద్ధంగా ఉండండిః ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనాతోనే ప్రపంచం కకావికలం అవుతుంటే... ఇదేం చిట్టచివరి మహమ్మారి కాదనీ.. మున్ముందు ఇంతకంటే భయంకరమైన వైరస్ రావచ్చుననీ ప్రపంచ ఆరోగ్య సంస్థ భయపెట్టే మాటలు చెబుతోంది..
కరోనాతోనే ప్రపంచం కకావికలం అవుతుంటే… ఇదేం చిట్టచివరి మహమ్మారి కాదనీ.. మున్ముందు ఇంతకంటే భయంకరమైన వైరస్ రావచ్చుననీ ప్రపంచ ఆరోగ్య సంస్థ భయపెట్టే మాటలు చెబుతోంది.. ఇదేం చివరి వైరస్ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ ఘాటైన హెచ్చరిక చేశారు. ప్రపంచం మరో వైరస్‌కు రెడీగా ఉంటే మంచిదన్న సలహా కూడా ఇచ్చారు.. ప్రపంచదేశాలు ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి.. మరిన్ని నిధులు కేటాయిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారాయన! కరోనాను కంట్రోల్ చేసి సంతృప్తి చెందితే సరిపోదని, ఇంతకంటే ప్రాణాంతక మహమ్మారులు వచ్చే అవకాశం ఉందని ఘెబ్రేయేసన్ అన్నారు. కరోనాకు ముందు కూడా చాలా వైరస్‌లు భూమిని అతలాకుతలం చేశాయని, కరోనా తర్వాత కూడా ఆ పరిస్థితి ఉంటుందని చెప్పుకొచ్చారు.. ఈ వాస్తవాన్ని ప్రజలంతా తెలుసుకుని అందుకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు.. రాబోయే కాలంలో ఇంతకంటే భయంకరమైన వైరస్ వస్తే దాన్ని కూడా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటీ ఈ అనుభవం సరికొత్త పాఠాలు నేర్పిందని, ఇకనుంచైనా వైరస్ నిరోధం కోసం నిధులు సమకూర్చుకోవడం మంచిదని ప్రపంచ దేశాలకు హితవు చెప్పారు ఘెబ్రేయేసన్..
“If and when we have an effective #COVID19 vaccine, we must also use it effectively.
I will repeat again: vaccine nationalism will prolong the pandemic, not shorten it”-@DrTedros pic.twitter.com/m5DZuZU6ya
— World Health Organization (WHO) (@WHO) September 8, 2020