ధన్యవాదాలు తెలిపిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇవాళ్టికి ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తనకు మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు..

ధన్యవాదాలు తెలిపిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Sep 08, 2020 | 3:27 PM

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇవాళ్టికి ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తనకు మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు శాఖాపరంగా పూర్తి సహాయ సహకారాలు అందించిన ఉద్యోగులకు పువ్వాడ ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అందిస్తున్న అభివృద్ధి ఫలాలను అర్హుల చెంతకు చేర్చేందుకు సుశిక్షితుడైన సైనికుడిలా పనిచేస్తున్నాని వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ దండు ఏకతాటిపై ఉందన్నఆయన.. జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికీ కేసీఆరే బాస్‌.. ఆయన మాటే కార్యకర్తలకు శిరోధార్యమని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాకు వరప్రదాయని అయిన సీతారామ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేసి రైతు కళ్లల్లో ఆనందం చూడటమే తన లక్ష్యమని పువ్వాడ ప్రకటించారు.