కరోనా ఎఫెక్ట్: ఐటీ ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’ పొడిగింపు..!

|

Jun 08, 2020 | 4:45 PM

దేశంలో రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసులు దృష్ట్యా మరో నాలుగు నెలల పాటు 'వర్క్ ఫ్రం హోం' పొడిగించే దిశగా ఐటీ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి...

కరోనా ఎఫెక్ట్: ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం పొడిగింపు..!
Follow us on

కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటికే అనేక సంస్థల్లోని చాలామంది ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దేశంలో రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసులు దృష్ట్యా మరో నాలుగు నెలల పాటు ‘వర్క్ ఫ్రం హోం’ పొడిగించే దిశగా ఐటీ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, ఫేస్‌బుక్‌, అమెజాన్ సంస్థలు ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. ఉద్యోగులందరికీ అక్టోబర్ 2 వరకు ‘వర్క్ ఫ్రం హోం’ను అమెజాన్ ప్రకటించగా.. 2020 ఏడాది చివరి వరకు ఉద్యోగులు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేసుకోవచ్చని ఫేస్‌బుక్‌ ప్రకటించింది.

ఇదిలా ఉంటే ‘వర్క్ ఫ్రం హోం’ చేసే ప్రతీ ఉద్యోగికి ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌ కోసం రూ. 50వేలు ప్రకటించాయి గూగుల్, హిటాచి సంస్థలు. కాగా, ‘వర్క్ ఫ్రం హోం’ పరిస్థితులపై తెలంగాణ ఐటీ ఉద్యోగుల అసోసియేషన్ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 500 ఐటీ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. 30కి పైగా ఐటీ సంస్థల ఉద్యోగుల ఆఫీసుల నుంచి చేయడానికి మక్కువ చూపుతున్నట్లు ఆ సర్వేలో తేలింది.

Also Read: 

ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..

పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. జూలై 8న ఇళ్లపట్టాలు పంపిణీ..

మత్స్యకారులకు గుడ్ న్యూస్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం.!

కేంద్రం సంచలనం.. మహిళల వివాహ వయసు పెంపు?

నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

అప్పుడు సచిన్‌ను ఔట్ చేశాక.. చంపుతామని బెదిరించారు..