చైనా మొబైళ్లను బహష్కరించిన.. అహ్మదాబాద్ వ్యాపారులు..

గాల్వన్ లోయలో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై చైనా గాడ్జెట్లను విక్రయించేది లేదని తెగేసి చెప్పారు. వాటికి ప్రత్యామ్నాయంగా భారత తయారీదారులు నాణ్యమైన, చవకైన ఉత్పత్తులను తయారు చేయాలని ఈ సందర్భంగా వ్యాపారులు కోరారు. అంతేకాదు, తమ షాపుల ముందున్న చైనా బోర్డును కనిపించకుండా ‘మేడిన్ ఇండియా’ బ్యానర్లతో మూసివేశారు. అహ్మదాబాద్లోని మూర్తిమంత్ కాంప్లెక్స్‌లో ఉన్న ఈ బహుళ అంతస్తుల భవనంలో 50కిపైగా రిటైల్, హోల్‌సేల్ షాపులు […]

చైనా మొబైళ్లను బహష్కరించిన.. అహ్మదాబాద్ వ్యాపారులు..
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2020 | 4:31 AM

గాల్వన్ లోయలో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై చైనా గాడ్జెట్లను విక్రయించేది లేదని తెగేసి చెప్పారు. వాటికి ప్రత్యామ్నాయంగా భారత తయారీదారులు నాణ్యమైన, చవకైన ఉత్పత్తులను తయారు చేయాలని ఈ సందర్భంగా వ్యాపారులు కోరారు. అంతేకాదు, తమ షాపుల ముందున్న చైనా బోర్డును కనిపించకుండా ‘మేడిన్ ఇండియా’ బ్యానర్లతో మూసివేశారు.

అహ్మదాబాద్లోని మూర్తిమంత్ కాంప్లెక్స్‌లో ఉన్న ఈ బహుళ అంతస్తుల భవనంలో 50కిపైగా రిటైల్, హోల్‌సేల్ షాపులు ఉన్నాయి. ప్రతిరోజు ఇక్కడ లక్షలాది రూపాయల విలువైన మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్ల విక్రయం జరుగుతూ ఉంటుంది. చైనా వస్తువులను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించామని, క్రమంగా చైనా బ్రాండ్లను, సైన్‌బోర్డులను తొలగించనున్నట్టు వ్యాపారులు పేర్కొన్నారు. ప్రస్తుతం తమ వద్ద ఉన్న చైనా వస్తువులను మరో నెలలో విక్రయించేస్తామని, ఆ తర్వాత భారతీయ, దక్షిణ కొరియా బ్రాండ్లను మాత్రమే విక్రయిస్తామని వివరించారు.

Also Read: అసోంలో వరద బీభత్సం.. 33కు పెరిగిన మృతుల సంఖ్య..