పానీపూరీని ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా దాన్ని లొట్టలేసుకుంటూ తింటారు. అయితే తాజాగా పానీపూరీ ఓ మహిళ ప్రాణాలను తీసింది. గప్‌చుప్‌ను తొందరుపాటుగా గుటుక్కుమని మింగేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒరిస్సాలోని సుందరగడ్ జిల్లా సరఫ్‌గడ్‌కు చెందిన ఫూలమతి కిషాన్ (30) అనే మహిళ పానీపూరీని వేగంగా తినేయడంతో.. అది కాస్తా ఆమె శ్వాసనాళంలో ఇరుక్కుపోయింది. దీనితో ఆమె ఉక్కిరిబిక్కిరై అక్కడే కుప్పకూలిపోయింది. భర్త, కుమారుడు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ మార్గం మధ్యలోనే మృతి చెందింది. దీనితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. (Women Lost Her Life)
Also Read:
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.?
శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..