AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రద్దీ బస్సుల్లో బంగారు నగలు కాజేసే లేడీ కిలాడీ అరెస్ట్.. సీసీ కెమెరాలతో గుట్టు రట్టు!

రద్దీగా ఉండే బస్సులు, పుణ్యక్షేత్రాలు, మార్కెట్ ప్రాంతాలను అడ్డాగా చేసుకుని ప్రయాణికుల మెడల్లోని బంగారు ఆభరణాలు, హ్యాండ్ బ్యాగులను ఏమాత్రం అనుమానం రాకుండా కాజేయడంలో సిద్ధహస్తురాలైన ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస చోరీలతో కలకలం సృష్టించిన ఈ లేడీ దొంగ నుంచి ఏకంగా 30 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. ఈ లేడి దొంగ కథేంటో తెలియాలంటే పూర్తి డిటెల్స్ లోకి వెళ్లాల్సిందే..

రద్దీ బస్సుల్లో బంగారు నగలు కాజేసే లేడీ కిలాడీ అరెస్ట్.. సీసీ కెమెరాలతో గుట్టు రట్టు!
Woman Gold Thief Arrested
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Sep 16, 2026 | 9:26 PM

Share

రద్దీగా ఉండే ప్రాంతాలలో హ్యాండ్ బ్యాగులు మెడల్లో ఉన్న బంగారు ఆభరణాలను ఏమాత్రం తెలియకుండా తొంగిలించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. తక్కువ వ్యవధిలోనే నాలుగు పోలీస్ స్టేషన్లో పరిధిలో అనేక చోరీలకు పాల్పడిన మహిళను సీసీ కెమెరాలు ద్వారా గుర్తించి ఎట్టకేలకు అరెస్టు చేశారు ఆమె నుంచి 30 తులాల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు.

ఈ కిలేడి పేరు వాణిశ్రీ. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన గోపి గౌడ్ భార్య . వయస్సు 33 ఏళ్లు. మంత్రాలయంలో ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.. కనీసం 50 వేలకు మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. వీరిలో ఓ మహిళ తిరుపతి నుంచి వచ్చి అనంతపురంలో ఫంక్షన్ చూసుకుని మంత్రాలయం వచ్చారు. ఆమె హ్యాండ్ బ్యాగ్ చోరీ చేసింది వాణిశ్రీ. అందులో ఉన్న 20 తులాల బంగారం నగలు చోరీకి గురవడంతో సదరూ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అదేవిధంగా మిడుతూరు మండలం కి చెందిన జయమ్మ అనే మహిళ పర్సు తో బస్సులో వస్తుండగా పక్కనే కూర్చున్న వాణిశ్రీ… పర్సు, అందులోని బంగారు ఆభరణాలను కొట్టేసింది. కర్నూలు నగరంలో సి క్యాంప్ సెంటర్లో రద్దీగా ఉన్న బస్సులో నుంచి ఓ మహిళ దిగుతుండగా ఆమె మెడలోని బంగారు గొలుసులు కొట్టేసింది. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ లో రద్దీగా ఉన్నప్పుడు బస్సులో ఎక్కుతుండగా ఓ మహిళ మెడలోని గొలుసును సులభంగా తస్కరించింది. ఇలా మంత్రాలయం కర్నూలు 3 టౌన్ కర్నూలు ఫోర్త్ టౌన్ పాణ్యం పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ముందుగా మంత్రాలయం లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అన్ని రకాల సీసీ కెమెరాలు పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా వాణిశ్రీ నీ గుర్తించారు. ఆమెని అదుపులోకి తీసుకోవడంతో తీగ లాగితే డంక కదిలింది. పోలీసులు ఇచ్చిన కౌన్సిలింగ్ తో అన్ని కేసులకు సంబంధించిన వివరాలు లభ్యమయ్యాయి. అన్ని చోరీ కేసులను ఛేదించి చోరీకి గురైన ఆభరణాలను రికవరీ చేసి వాణిశ్రీని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక చేయండి..

Follow Us