నడిరోడ్డుపై నకిలీ అధికారి దుమ్ము దులిపేసింది..
జార్ఖండ్‌లోని జంషెడ్ పూర్‌లో ఓ మహిళ నకిలీ అవినీతి నిరోధక శాఖ అధికారిని పట్టుకుని దేహశుద్ధి చేసింది. జనం చూస్తుండగానే నడిరోడ్డుపై చెప్పుతో కొడుతూ దుమ్ము దులిపింది. జంషెడ్‌పూర్‌కు చెందిన రాఖీ వర్మకు కుటుంబ తగాదాలు ఉన్నాయి. కేసు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. ఈ క్రమంలో ఫణీంద్ర మహత్వ్ అనే వ్యక్తి బాధితురాలు రాఖీ వర్మకు ఫోన్ చేసి.. తనను ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. కుటుంబ తగాదాలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. ఇందుకోసం 50 […]
జార్ఖండ్‌లోని జంషెడ్ పూర్‌లో ఓ మహిళ నకిలీ అవినీతి నిరోధక శాఖ అధికారిని పట్టుకుని దేహశుద్ధి చేసింది. జనం చూస్తుండగానే నడిరోడ్డుపై చెప్పుతో కొడుతూ దుమ్ము దులిపింది.
జంషెడ్‌పూర్‌కు చెందిన రాఖీ వర్మకు కుటుంబ తగాదాలు ఉన్నాయి. కేసు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. ఈ క్రమంలో ఫణీంద్ర మహత్వ్ అనే వ్యక్తి బాధితురాలు రాఖీ వర్మకు ఫోన్ చేసి.. తనను ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. కుటుంబ తగాదాలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. ఇందుకోసం 50 వేల రూపాయలు ఖర్చవుతుందని, డబ్బులు ఆఫీసుకు వచ్చి ఇవ్వాలని కోరాడు.
ఈ విషయాన్ని రాఖీ వర్మ పెద్దగా పట్టించుకోలేదు. అయితే.. ఫణీంద్ర మహత్వ్ పదే పదే.. ఫోన్ చేసి వేధించడంతో.. రాఖీ వర్మ నేరుగా అతను చెప్పిన ఆఫీసుకు వెళ్లి.. అతన్ని నిలదీసింది. దీంతో.. అతనో ఫేక్ ఆఫీసర్ అని తెలియడంతో కోపంతో రెచ్చిపోయింది. అతని కాలర్ పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి చెప్పుతో దేహశుద్ధి చేసింది. అసలే.. కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న తాను.. ఫణీంద్ర మహత్వ్ వేధింపులతో విసిగిపోయానని బాధితురాలు పేర్కొంది.
మహిళ ఫిర్యాదుతో పోలీసులు ఫణీంద్రపై కేసు నమోదు చేశారు. గతంలో కూడా అతను ఈ రకంగా కొందరిని మోసం చేశాడని తెలిపా