తిరువనంతపురం విమానాశ్రయానికి.. పక్షులతో పెను ముప్పు!

కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పక్షుల నుంచి తీవ్ర ముప్పు పొంచి వుంది. అయినా... అధికారులు మాత్రం తమ అలసత్వం వీడడం లేదు. కోళికోడ్‌లో అతిపెద్ద విమాన ప్రమాదం సంభవించిన

  • Tv9 Telugu
  • Publish Date - 2:00 pm, Sun, 9 August 20
తిరువనంతపురం విమానాశ్రయానికి.. పక్షులతో పెను ముప్పు!

కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పక్షుల నుంచి తీవ్ర ముప్పు పొంచి వుంది. అయినా… అధికారులు మాత్రం తమ అలసత్వం వీడడం లేదు. కోళికోడ్‌లో అతిపెద్ద విమాన ప్రమాదం సంభవించిన నేపథ్యంలో తిరువనంతపురంలోని విమానాశ్రయానికి ఉన్న ముప్పు మళ్లీ వెలుగులోకి వచ్చింది. విమానాలు ల్యాండ్ అయ్యే దగ్గర పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతుంటాయి.

2019 జనవరి నుండి డిసెంబర్ వరకు తిరువనంతపురం విమానాశ్రయంలో 28 సార్లు పక్షుల వాళ్ళ ముప్పు ఏర్పడిందని అధికారులు నిర్ధారించారు. దీంతో అటు విమానాలకు, ఇటు పక్షులకు తీవ్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు చాలా కాలం నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎగిరే విమానాలను పక్షులు ఢీ కొంటున్నాయని… అయినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. దగ్గరే ఉన్న మాంసం విక్రయదారులు వ్యర్థాలను విమానాశ్రయం దగ్గర్లో పారబోస్తున్నారు. ఈ వ్యర్థాల కోసం పక్షులు గుంపులు గుంపులుగా విమానాశ్రయం దగ్గర తిరుగుతూ ఉంటాయి.

Read More:

30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు.. తొలి దశలో 15 లక్షల ఇళ్లు..!

ఆదుకున్న రబీ దిగుబడి.. రాష్ట్రానికి తప్పిన ఆహార ఇబ్బందులు..!