ఇసుక బస్తాలు మోస్తున్న మాజీ మంత్రి..! రీఎంట్రీ ఇస్తున్నారా..?

| Edited By:

Oct 11, 2019 | 2:15 PM

మంత్రిగా పదేళ్ల పాటు చేసిన అనుభవం, 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా సుధీర్ఘమైన రాజకీయ చతురిత, అంతేగాక.. ఓ రాష్ట్రానికి జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా చేశారు. ఆయన ఇప్పుడు ఇసుక బస్తాలు మోస్తున్నారు. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా..? మాజీ మంత్రి రఘువీరారెడ్డి. గత కొద్ది రోజులుగా.. పార్టీకి రాజీనామా చేసి.. అజ్ఞాతంలో ఉన్న ఆయన.. తాజాగా.. చేసిన ఓ పనితో వెలుగులోకి వచ్చారు. ఊరికి ఆపద వచ్చిందని.. ముందుకెళ్లి నిలుచున్నాడు. ఆయనే.. మాజీ మంత్రి రఘువీరా రెడ్డి. […]

ఇసుక బస్తాలు మోస్తున్న మాజీ మంత్రి..! రీఎంట్రీ ఇస్తున్నారా..?
Follow us on

మంత్రిగా పదేళ్ల పాటు చేసిన అనుభవం, 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా సుధీర్ఘమైన రాజకీయ చతురిత, అంతేగాక.. ఓ రాష్ట్రానికి జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా చేశారు. ఆయన ఇప్పుడు ఇసుక బస్తాలు మోస్తున్నారు. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా..? మాజీ మంత్రి రఘువీరారెడ్డి. గత కొద్ది రోజులుగా.. పార్టీకి రాజీనామా చేసి.. అజ్ఞాతంలో ఉన్న ఆయన.. తాజాగా.. చేసిన ఓ పనితో వెలుగులోకి వచ్చారు. ఊరికి ఆపద వచ్చిందని.. ముందుకెళ్లి నిలుచున్నాడు. ఆయనే.. మాజీ మంత్రి రఘువీరా రెడ్డి. 2019 ఎన్నికల తరువాత ఆయన ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన ఆయన.. ప్రస్తుతం అనంతపురంలోని తన సొంతూరులోనే ఉంటున్నారు.

చెరువు గండి పడితే.. పంచె ఎగ్గట్టి.. ఇసుక బస్తాను భుజాన వేసుకుని వెళ్లి తన వంతు ప్రయత్నం చేశారు. అనంతపురంలోని కురుస్తున్న వర్షాలకు మడకశిర మండలం గంగులవాయి పాళ్యంలో చెరువుకు నీళ్లు భారీగా చేరి.. గండి పడింది. కట్ట పూర్తిగా తెగితే.. గ్రామంలోకి నీళ్లు వస్తాయని స్థానికులు భయాందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న రఘువీరా రెడ్డి.. ఘటనా స్థలానికి చేరుకుని.. తన వంతు సహాయం అందించారు. రైతులతో కలిసి ఇసుక బస్తాలు మోసి గండి పూడ్చివేతకు సహకరించారు. ఆయన బాటలోనే తహసీల్దార్, అధికారులు కూడా నడిచారు.

రాజకీయాలకు కొంత గ్యాప్ తీసుకోవాలని డిసైడయిన రఘువీరా రెడ్డి.. పాలిటిక్స్‌కి దూరంగా ఉంటున్నారు. అయితే.. ఇటీవలే తన ఊరి చెరువుకు గండి పడటంతో స్వయంగా అనుచరులతో కలిసి రంగంలోకి దిగారు. గత కొంతకాలంగానే సొంతూరులో జరుగుతోన్న ఆలయ నిర్మాణం పనులను ఆయనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాగా.. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ నేత కేవీపీ, ఉండవల్లి వచ్చి రఘువీరాను కలిసి వెళ్లారు.

అయితే.. వారు రఘువీరా రెడ్డిని మళ్లీ రాజకీయాల్లోకి ఆహ్వానించారనే టాక్‌ వినిపిస్తోంది. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకునే స్థితిలో లేదు. మరి ఒక వేళ రఘువీరా మళ్లీ పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారా..? ఇస్తే.. సొంత పార్టీలోనే కొనసాగుతారా..? లేక వేరే పార్టీలోకి వెళతారా అన్నది అందరిలోనూ ఆసక్తిగా మారింది. ఏదేమైనా.. ఓ మాజీ మంత్రి ఇలా సహాయం చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.