భర్త ఆదాయం ఎంతో తెల్సుకునే హక్కు భార్యకు ఉంది : కేంద్ర సమాచార కమిషన్‌ ఆసక్తికర తీర్పు

| Edited By: Anil kumar poka

Dec 03, 2020 | 1:50 PM

భర్త ఆదాయం ఎంతో తెల్సుకునే హక్కు భార్యకు ఉందని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ప్రకటించింది. తన భర్త ఆదాయ వివరాలను తెలియజేయాలని రాజస్థాన్ జోధ్‌పూర్‌కి చెందిన రెహ్మత్‌ బాను ఆదాయపన్ను శాఖను కోరగా....

భర్త ఆదాయం ఎంతో తెల్సుకునే హక్కు భార్యకు ఉంది : కేంద్ర సమాచార కమిషన్‌ ఆసక్తికర తీర్పు
Follow us on

భర్త ఆదాయం ఎంతో తెల్సుకునే హక్కు భార్యకు ఉందని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ప్రకటించింది. తన భర్త ఆదాయ వివరాలను తెలియజేయాలని రాజస్థాన్ జోధ్‌పూర్‌కి చెందిన రెహ్మత్‌ బాను ఆదాయపన్ను శాఖను కోరగా, వారు సమాచారమివ్వడానికి తిరస్కరించారు. దీంతో సదరు భార్య సీఐసీకి అప్పీల్‌ చేసుకోగా, పిటిషన్‌ను విచారించిన కేంద్ర సమాచార కమిషన్, జోథ్‌పూర్‌ ఆదాయపన్ను శాఖకు పదిహేనురోజుల్లోపు భార్య రెహ్మత్‌ కోరిన సమాచారమివ్వాలని ఆదేశించింది. మూడో వ్యక్తి ఆదాయ సమాచార వివరాలు ఇవ్వడం కుదరదని, ఇది సమాచార హక్కు నిర్వచన పరిధిలోకి రాదని, ఆదాయ పన్ను శాఖ చేసిన వాదనను సీఐసీ తిరస్కరించింది. ఇది వ్యక్తిగత సమాచారమని, దీన్ని వెల్లడించడం కుదరదంటూ ఆమె భర్త చేసిన వాదన నేపథ్యంలో ఈ తీర్పు వెలువడిందని భార్య తరపు న్యాయవాది రజక్‌ హైదర్‌ వెల్లడించారు.