AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New social media rules : సోషల్ మీడియా మీద ఉక్కుపాదం దేనికి? ఇప్పటికే ఐటీ చట్టం ఉండగా అంత అవసరమా? అసలీ కొత్త చట్టంలో ఏముంది?

భారతదేశంలో 53 కోట్ల మంది వాట్సాప్‌ వాడుతున్నారు. 41 కోట్ల మంది ఫేస్‌బుక్‌లో లాగిన్ అయ్యారు. యూట్యూబ్‌కు 44 కోట్ల 8 లక్షల కోట్ల మంది, ట్విటర్‌కు..

New social media rules : సోషల్ మీడియా మీద ఉక్కుపాదం దేనికి? ఇప్పటికే ఐటీ చట్టం ఉండగా అంత అవసరమా? అసలీ కొత్త చట్టంలో ఏముంది?
Venkata Narayana
|

Updated on: Feb 27, 2021 | 6:25 PM

Share

భారతదేశంలో 53 కోట్ల మంది వాట్సాప్‌ వాడుతున్నారు. 41 కోట్ల మంది ఫేస్‌బుక్‌లో లాగిన్ అయ్యారు. యూట్యూబ్‌కు 44 కోట్ల 8 లక్షల కోట్ల మంది, ట్విటర్‌కు కోటి 75 లక్షల మంది, ఇన్‌స్ట్రాగామ్‌కు 21 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఈ క్రమంలో సింగిల్‌ క్లిక్‌తో ఏ కంటెంట్‌ పడితే.. అది ఫార్వర్డ్ అవుతుంది. చవకగా స్మార్ట్ ఫోన్లు.. ఆఫర్ల కొద్ది అందుబాటులో డేటా. ఇక వాడుకోవడానికి ఇబ్బంది ఏంటీ అన్నట్లు ఉంది నేటి పరిస్థితి. వాడుకున్నొళ్లకు వాడుకున్నంత అన్నట్లుగా సాగుతోంది సోషల్ మీడియా, ఓటిటిల వాడకం. సోషల్‌ మీడియా సంస్థలకు అతిపెద్ద లాభదాయక మార్కెట్‌గా మారింది భారత్‌. ఈ క్రమంలో దీనికి మూకుతాడు వేసేందుకు కొత్త చట్టం తీసుకువచ్చామంటోంది కేంద్రం.

సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వాటిలో ఏది మంచి? ఏది చెడు? ఎవరికి మంచి? ఎవరికి చెడు? ఒకరికి మంచి.. మరొకరికి చెడు అవుతుందా? కేంద్రం తెచ్చిన కొత్త ఐటీ రూల్స్ ఏం చెప్తున్నాయి? సోషల్ మీడియాలో మంచి ఎంత? చెడు ఎంత? అందులో పెట్టే కంటెంట్‌తో ప్రమాదం పొంచి ఉందా? ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇప్పటి నుంచి మరో ఎత్తు అన్నట్లు కేంద్రం వ్యవహరించబోతుందా? రూల్స్ తెలుసుకోకుండా.. కంటెంట్‌ సిద్ధమైతే.. కటౌట్‌ పరేషాన్ కావల్సిందేనా? అసలు ఈ కొత్త రూల్స్ ఏం చెప్తున్నాయి? మనం తెలుసుకోవాల్సింది ఏంటి? అనే విషయానికొద్దాం.

అశ్లీలానికి తావులేదు, అసభ్యతకు చాన్స్ లేదు, హింసకు చోటు లేదు. మూడు మాటల్లో కేంద్రం కొత్తగా ప్రతిపాదిస్తున్న ఐటీ రూల్స్ సారాంశమిదే. కంటెంట్‌ ఎక్కడ పుట్టిందో తెలుస్తోంది. ఎవరు దాన్ని వైరల్ చేశారో తెలిసిపోతుంది. దేశ భద్రతకు ప్రమాదం ఉండకూడదు. సమగ్రత దెబ్బతినకూడదు. పక్క వాడి ఆత్మగౌరవానికి భంగం కలుగకూడదు. ప్లాట్‌ ఫాం ఉందని పరేషాన్ చేయొద్దు. పక్కింట్లో నిప్పులు పోయొద్దు. ట్రెండ్ మారుతుంది. సోషల్ మీడియా అంతకంతకు విస్తరిస్తోంది. జనం సినిమా థియేటర్‌కు వెళ్లడం ఎందుకు దండుగ. ఓటీటీ ఫ్లాట్‌ఫాం మన చేతిలో ఉండగా అనుకుంటున్నారు. అందుకే ఆ వ్యాపారం సైతం మూడు రిలీజ్‌లు.. ఆరు హిట్‌లు అన్నట్లుగా సాగుతోంది. మరి అందులో ఉన్న కంటెంట్‌ సంగతేంటి? ఏది పడితే.. అది వదిలితే జనం చూసేయ్యాలా? ఇప్పుడిదే బిగ్ క్వశ్చన్. ఎంటర్‌టైన్‌ మెంట్ మాటున ఉన్న ఎమోషన్ సంగతేంటి? సామాన్యుడికి ఉన్న అభ్యంతరాల మాటేంటి? అందుకే ఈ కొత్త చట్టం తీసుకువస్తున్నామంటోంది కేంద్రం.

ఇప్పటికే ఐటీ చట్టం ఉండగా.. మరి ఈ కొత్త చట్టం ఎందుకు? ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌ను కట్టడి చేయడమేనా? ఈ కొత్త రూల్స్‌కు సోషల్ మీడియా దిగ్గజాలు ఒప్పుకుంటాయా? ఇదే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఎలాంటి రెగ్యూలేషన్స్‌ ఈ కొత్త చట్టంలో ఉండబోతున్నాయి? అన్న డిబేట్ పెద్ద ఎత్తున సాగుతోంది. కంటెంట్‌పై సుమోటగా తీసుకోవచ్చన్న సూచనల నేపథ్యంలో దేనిపై కేసు నమోదు చేయాలి? ఏది కంటెమ్ట్ అవుతుందన్న చర్చ సాగుతోంది.

Read also :  మోదీ ప్రకటన నేపథ్యంలో వైజాగ్ స్టీల్ అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ కొత్త టర్న్.! ప.గో జిల్లా పర్యటనలో వైసీపీ టార్గెట్‌గా హాట్ కామెంట్స్