గ్రహణం ఎఫెక్ట్: గరికను ఆహారపదార్థాలపై ఎందుకు ఉంచుతారంటే?

నేడు ప్రపంచ వ్యాప్తంగా సూర్యగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 2019లో ఇది మూడొవ సూర్యగ్రహణం. కాగా.. సూర్యగ్రహణం ఎప్పుడూ అమావాస్యకే ఏర్పడుతుంది. అలాగని.. ప్రతీ అమావాస్యకి గ్రహణం ఏర్పడదు. సాధారణంగా.. సూర్యగ్రహణం వస్తే.. 8 నిమిషాల కన్నా ఎక్కువ వ్యవధి ఉండదు అయితే.. ఈసారి వచ్చిన సూర్యగ్రహణం మాత్రం.. ఏకంగా మూడు గంటల రెండు నిమిషాల పాటు భారతదేశమంతటా ఏర్పడింది. అలాగే.. శ్రీలంక కొన్ని […]

గ్రహణం ఎఫెక్ట్: గరికను ఆహారపదార్థాలపై ఎందుకు ఉంచుతారంటే?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Dec 26, 2019 | 5:52 PM

నేడు ప్రపంచ వ్యాప్తంగా సూర్యగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 2019లో ఇది మూడొవ సూర్యగ్రహణం. కాగా.. సూర్యగ్రహణం ఎప్పుడూ అమావాస్యకే ఏర్పడుతుంది. అలాగని.. ప్రతీ అమావాస్యకి గ్రహణం ఏర్పడదు. సాధారణంగా.. సూర్యగ్రహణం వస్తే.. 8 నిమిషాల కన్నా ఎక్కువ వ్యవధి ఉండదు అయితే.. ఈసారి వచ్చిన సూర్యగ్రహణం మాత్రం.. ఏకంగా మూడు గంటల రెండు నిమిషాల పాటు భారతదేశమంతటా ఏర్పడింది. అలాగే.. శ్రీలంక కొన్ని గల్ఫ్ దేశాలు, సుమత్రా, మలేషియా, సింగపూర్‌ దేశాల్లోనూ గ్రహణం ఎఫెక్ట్ కనిపించింది.

అయితే.. గ్రహణం సమయంలో ముఖ్యంగా భారతదేశంలో.. పలు ఆచార వ్యవహారాలను పాటిస్తారు. ఆ సమయంలో అన్నం తినకూడదని.. ఎలాంటి పనులు చేయకూడదని అంటూంటారు. ముఖ్యంగా గర్భిణులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు చెబుతూండటం మనం వింటూనే ఉన్నాం. అలాగే.. వండిన ఆహార పదార్థాలు, కొన్ని వస్తులు, ధాన్యంపై గరిక (దర్భలు) వేస్తూంటారు. ఇలా ఎందుకు ఉంచుతారనే ప్రశ్న అందరిలోనూ ఎదురవూతూనే ఉంటుంది.

దానికి అసలు కారణం ఏంటంటే? గ్రహణ సమయంలో భూమి మీదకు అతి ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది. అయితే గరిక అనేది యాంటీ రేడియేషన్ గుణాలను కలిగి ఉంటుంది. అందుకే గ్రహణ సమయంలో గరికను ఇంట్లోని అన్ని పాత్రలపై ఉంచడం వల్ల రేడియేషన్ ప్రభావం నుంచి కొంతమేర తప్పించుకోవచ్చని దీని అర్థమట. దీనిని.. మన పెద్దలు పురాతన కాలం నుంచి ఆచరిస్తూ ఉన్నారు.