AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Induction Stove: ఎఫెక్ట్‌ మామూలుగా లేదుగా.. దేశవ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్‌లను ఎగబడి కొంటున్న జనాలు

Induction Stove: ఇండక్షన్ పొయ్యిలకు డిమాండ్ పెరుగుతోంది. ఎల్పీజీ కొరత ప్రభావంతో దేశవ్యాప్తంగా ఇండక్షన్ కుక్‌టాప్‌లు ఇప్పుడు ప్రత్యామ్నాయ వంట సాధనంగా వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో వీటి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్..

Induction Stove: ఎఫెక్ట్‌ మామూలుగా లేదుగా.. దేశవ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్‌లను ఎగబడి కొంటున్న జనాలు
Induction Stove
Subhash Goud
|

Updated on: Mar 11, 2026 | 12:34 PM

Share

Induction Stove Sales: దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత, సరఫరా అంతరాయం కారణంగా ఇండక్షన్ కుక్‌టాప్‌ల విక్రయాలు ఒక్కసారిగా పెరిగాయి. ఎల్పీజీ అందుబాటులో లేకపోవడంతో సాధారణ కుటుంబాలు, హోటల్ యజమానులు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్‌లను కొనుగోలు చేయడానికి దుకాణాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల వైపు పరుగులు పెడుతున్నారు. స్థానిక విక్రేతలతో పాటు ఈ-కామర్స్ సంస్థలు కూడా ఇటీవల రోజుల్లో ఇండక్షన్ స్టవ్‌ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని చెబుతున్నాయి. ముఖ్యంగా Flipkart, Amazon వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో డిమాండ్ ఒక్కసారిగా పెరిగినట్లు సమాచారం.

ఫ్లిప్‌కార్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నాలుగు నుంచి ఐదు రోజులలో ఇండక్షన్ కుక్‌టాప్‌ల అమ్మకాలు గత మూడు నుంచి నాలుగు వారాల కంటే మూడు రెట్లు పెరిగాయి. ముఖ్యంగా Delhi, Kolkata, Uttar Pradesh ప్రాంతాల్లో ఎక్కువగా కొనుగోళ్లు నమోదయ్యాయి. ప్రస్తుత గ్లోబల్ పరిస్థితుల నేపథ్యంలో ఇండక్షన్ కుక్‌టాప్‌లు ఒకప్పుడు కిచెన్ అప్‌గ్రేడ్‌గా భావిస్తే ఇప్పుడు చాలా కుటుంబాలకు అవి అవసరమైన ప్రత్యామ్నాయంగా మారాయని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి తెలిపారు. ఎల్పీజీ ధరలు పెరగడం, సరఫరా సమస్యలు రావడం వంటి కారణాల వల్ల వినియోగదారులు ముందుగానే ఇండక్షన్ స్టవ్‌లను కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.

ఇది కూడా చదవండి: Bank Notes: 10, 20, 50 రూపాయల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఇక Amazon India కూడా ఇండక్షన్ కుక్‌టాప్‌లకు భారీ డిమాండ్ నమోదైందని వెల్లడించింది. సాధారణ రోజులతో పోలిస్తే గత 24 గంటల్లో Amazon.in వెబ్‌సైట్‌లో ఇండక్షన్ స్టవ్‌లకు 20 రెట్లు ఎక్కువ డిమాండ్ వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఇక ఆఫ్‌లైన్ దుకాణాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ముంబైలోని పలు ఎలక్ట్రానిక్ స్టోర్లలో ఇండక్షన్ స్టవ్‌ల కొనుగోళ్లు, విచారణలు గణనీయంగా పెరిగాయని విక్రేతలు చెబుతున్నారు.

థానేలోని మన్‌పాడా ప్రాంతంలో ఉన్న గోల్డెన్ స్టీల్ అండ్ అప్లయెన్సెస్ స్టోర్ మేనేజర్ సాగర్‌ సత్రా మాట్లాడుతూ.. గతంలో రోజుకు 5 నుంచి 7 గ్యాస్ స్టవ్‌లు అమ్ముడవుతుండగా, వారానికి 2–3 ఇండక్షన్ స్టవ్‌లు మాత్రమే అమ్ముడయ్యేవని తెలిపారు. అయితే గత వారం రోజులుగా ఇండక్షన్ స్టవ్‌ల విక్రయాలు వారానికి 10 వరకు చేరి ఐదు రెట్లు పెరిగాయని చెప్పారు.

అలాగే కల్బాదేవిలోని అట్లాంటా ఎంటర్‌ప్రైజెస్ స్టోర్‌లో కూడా డిమాండ్ పెరిగినట్లు విక్రేతలు తెలిపారు. సాధారణంగా రోజుకు ఒకటి లేదా రెండు విచారణలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఒకే రోజులోనే నలుగురు కస్టమర్లు ఇండక్షన్ స్టవ్‌లు కొనుగోలు చేశారని వారు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: India Gas Crisis: హైదరాబాద్‌లో హోటళ్లు, రెస్టారెంట్లు బంద్‌.. హోటల్స్ అసోసియేషన్స్ కీలక నిర్ణయం!

మరోవైపు, ఎల్పీజీ కొరత కొనసాగితే ఇండక్షన్ స్టవ్‌ల విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని విక్రేతలు భావిస్తున్నారు. మలాడ్‌లోని బిగ్ బి అప్లయెన్సెస్ స్టోర్‌కు చెందిన Govardhan Trivedi మాట్లాడుతూ, వాణిజ్య ఎల్పీజీ సరఫరా పూర్తిగా అంతరాయం కలగడంతో కొన్ని హోటల్ యజమానులు కూడా పెద్ద ఇండక్షన్ స్టవ్‌ల గురించి విచారణ చేస్తున్నారని తెలిపారు.

గ్యాస్ స్టవ్‌లతో పోలిస్తే ఇండక్షన్ కుక్‌టాప్‌లు ఓపెన్ ఫ్లేమ్‌ను ఉపయోగించవు. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ టెక్నాలజీ ద్వారా పాత్రను నేరుగా వేడిచేస్తాయి. అందువల్ల ఎల్పీజీ సిలిండర్ల అవసరం లేకుండా వంట చేయడం సాధ్యమవుతుంది.

మొత్తంగా చూస్తే ఎల్పీజీ కొరత ప్రభావంతో దేశవ్యాప్తంగా ఇండక్షన్ కుక్‌టాప్‌లు ఇప్పుడు ప్రత్యామ్నాయ వంట సాధనంగా వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో వీటి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Bank Notes: 10, 20, 50 రూపాయల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us