ఈ రెండు వేల నోటుకి ఏమైంది..? ఎక్కడ దాక్కుంది..?

2వేల నోటు.. బ్లాక్ మనీని బ్లాక్ చేసేందుకు రివ్వున దూసుకొచ్చింది. ఏడాది పాటు జనం జేబుల్లో తళతళలాడింది. ఆ నోటును తీసుకోవాలంటే బ్యాంకుల ముందు పోరాటం చేయాల్సి వచ్చేది. తీసుకున్న తర్వాత చిల్లర కోసం చెమటోడాల్సి వచ్చేది. సామాన్యులకు అదో సంజీవని. బడాబాబుల బ్లాక్ దందాకు బూస్ట్ నిచ్చే వరదాయని. ఏ ఉద్దేశ్యంతో దాన్ని గ్రాండ్‌గా ప్రవేశపెట్టారో కానీ.. అది కాస్తా అటకెక్కింది. ఇప్పుడు.. ఏటీఎంలలో చిల్లర తప్ప పెద్ద నోటు తీసుకోవాలంటే గగనమైంది. ఇంతకూ ఈ […]

ఈ రెండు వేల నోటుకి ఏమైంది..? ఎక్కడ దాక్కుంది..?
Follow us

| Edited By: Srinu

Updated on: Apr 05, 2019 | 6:28 PM

2వేల నోటు.. బ్లాక్ మనీని బ్లాక్ చేసేందుకు రివ్వున దూసుకొచ్చింది. ఏడాది పాటు జనం జేబుల్లో తళతళలాడింది. ఆ నోటును తీసుకోవాలంటే బ్యాంకుల ముందు పోరాటం చేయాల్సి వచ్చేది. తీసుకున్న తర్వాత చిల్లర కోసం చెమటోడాల్సి వచ్చేది. సామాన్యులకు అదో సంజీవని. బడాబాబుల బ్లాక్ దందాకు బూస్ట్ నిచ్చే వరదాయని. ఏ ఉద్దేశ్యంతో దాన్ని గ్రాండ్‌గా ప్రవేశపెట్టారో కానీ.. అది కాస్తా అటకెక్కింది. ఇప్పుడు.. ఏటీఎంలలో చిల్లర తప్ప పెద్ద నోటు తీసుకోవాలంటే గగనమైంది. ఇంతకూ ఈ పింక్ నోట్‌కు ఏమైంది..? ఎక్కడ దాక్కుంది..?

2016, నవంబర్2.. ఎవ్వరూ మర్చిపోలేని రోజు.. 4 వేల కోసం బ్యాంకుల ముందు నరకం చూసిన ఆ క్షణాలు మన కళ్ల ముందు కదలాడుతున్నాయ్.. రెండు వేల నోటును చూడగానే సంబరపడ్డామ్.. దాన్ని మార్చుకునేందుకు నానా తంటాలు కూడా పడ్డామ్.. జనాన్ని ఇంతలా ఇబ్బంది పెట్టిన ఈ నోటు ఇప్పుడు కనిపించడం లేదు. గతేడాది మార్చి నాటికి దేశంలో చలామణిలో ఉన్న ఈ 2వేల నోట్లు.. ఈ మార్చికి వచ్చే సరికి 37 శాతానికి తగ్గింది. ఆర్బీఐ డేటా ప్రకారం 2017 నాటికి మొత్తం 3వేల 285 మిలియన్లు, మార్చి 2018 నాటికి 3 వేల 363 మిలియన్లు వరకు 2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు అందులో సగానికి సగం పైగా తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు.

గతంలో వెయ్యినోట్లు ఉన్నప్పుడు కరెన్సీకి పెద్దగా కొరత వచ్చేది కాదు. ఇప్పుడు వెయ్యి స్థానంలో 2వేల నోటు వచ్చిన తర్వాత ఎక్కడ చూసిన కరెన్సీ కష్టాలే కనిపిస్తున్నాయి. 500 నోటు కనిపిస్తున్నా, 2వేల నోటు మాత్రం గగనమైంది. అలాగని కరెన్సీ విలువ ఏమైనా తగ్గిందా అంటే అదీ లేదు. పెద్ద నోట్ల రద్దుకు ముందు మార్కెట్లో 5 లక్షల కోట్ల నగదు ఉంటే.. తర్వాత అది ఏకంగా 16లక్షల 50వేల కోట్లకు పెరిగింది. మరి మార్కెట్లో ఇంత కరెన్సీ చెలామణిలో ఉన్నా.. 2వేల నోటు ఎందుకు కనిపించడంలేదు..? ఇదే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది.

ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా రాజకీయ నేతల హడావుడి కనిపిస్తోంది. ఓటరు మహాశయుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు వరాలు ప్రకటిస్తున్నారు. కానీ ఇవేమీ సరిపోవు. మళ్లీ గెలవాలంటే అంతకుమించి అన్న తరహాలో పొలిటికల్ లీడర్స్ తాయిలాలను సిద్ధం చేస్తున్నారు. అందుకు నోటి మూటలు కాదు.. నోటు మాటలు కావాలన్న సూత్రం వంటబట్టించుకున్న మన నేతలు తాయిలాలను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈసీ ఎక్కడికక్కడ నిఘా పెట్టింది. చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి.. మరీ సోదాలు చేస్తోంది. ఈ సోదాల్లో 2వేల నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయపడుతున్నాయి.

దేశంలో ఇప్పటివరకు ఈసీ, పోలీసులు అధికారుల తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. దేశవ్యాప్తంగా తనిఖీల్లో పట్టుబడ్డ నగదు, బంగారం, వెండి, మద్యం వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. సీఈసీ చెప్తున్న లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా 377 కోట్ల 511 రూపాయలు తనిఖీల్లో పట్టుబడింది. అలాగే.. 312 కోట్ల 859 రూపాయల విలువ చేసే బంగారం, వెండి తనిఖీల్లో పట్టుబడింది. ఇక 28 కోట్ల 628 రూపాయల ఇతర వస్తువులు పోలీసులు తనిఖీల్లో పట్టుబడ్డాయి.

కాగా.. పట్టుబడుతున్న సొమ్ము జస్ట్ శాంపిల్ మాత్రమే.. 2వేల నోట్ కనిపించకపోవడానికి కారణం ఎన్నికల ఎఫెక్టేనంటున్నారు విశ్లేషకులు. ఈ ఎన్నికలుపోయే వరకు నోట్ల కొరత తప్పదని చెబుతున్నారు.