మాయాపూర్‌లో.. తెరుచుకున్న చంద్రోదయ ఆలయం..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తోంది. కాగా.. వెస్ట్ బెంగాల్‌లోని మాయాపూర్‌లో ఉన్న చంద్రోదయ ఆలయం మూడు నెలల తర్వాత తెరుచుకుంది. ఇస్కాన్‌ ప్రపంచ హెడ్‌క్వార్టర్స్ అయిన

మాయాపూర్‌లో.. తెరుచుకున్న చంద్రోదయ ఆలయం..

Edited By:

Updated on: Jul 05, 2020 | 9:50 PM

West Bengal’s Chandrodaya Temple: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తోంది. కాగా.. వెస్ట్ బెంగాల్‌లోని మాయాపూర్‌లో ఉన్న చంద్రోదయ ఆలయం మూడు నెలల తర్వాత తెరుచుకుంది. ఇస్కాన్‌ ప్రపంచ హెడ్‌క్వార్టర్స్ అయిన మాయాపూర్‌లోని ఈ ఆలయ ద్వారాలు కరోనా వైరస్ కారణంగా మార్చి 23న మూసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందే ఆలయాన్ని మూసివేశారు. తాజాగా ఈ ఆలయాన్ని తెరిచిన అధికారులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు భక్తులను అనుమతించనున్నారు.

ఈ క్రమంలో.. రోజుకు 200 మంది వరకు భక్తులు దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్టు ఆలయ అధికార ప్రతినిధి సుబ్రత దాస్ తెలిపారు. భక్తులందరూ ప్రధాన ద్వారం ‘గామన్ గేట్’ నుంచి రావాల్సి ఉంటుందని, మాస్క్ లేకుంటే ఆలయంలోకి అనుమతించబోమని పేర్కొన్నారు. ఆలయ పరిసరాలను, రెస్టారెంట్లు, టాయిలెట్లను శానిటైజ్ చేసినట్టు వివరించారు.