AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా రోగిపై ఆస్పత్రి వాచ్‌మెన్ అఘాయిత్యం..!

కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గులు దారుణాలకు యత్నిస్తున్నారు. వ్యక్తుల పరిస్థితి ఉన్న పరిసరాలను మరిచి అమాయకులపై అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు.

కరోనా రోగిపై ఆస్పత్రి వాచ్‌మెన్ అఘాయిత్యం..!
Balaraju Goud
|

Updated on: Nov 07, 2020 | 5:41 PM

Share

కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గులు దారుణాలకు యత్నిస్తున్నారు. వ్యక్తుల పరిస్థితి ఉన్న పరిసరాలను మరిచి అమాయకులపై అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు. ఆసుపత్రిలో కరోనా రోగిపై కూడా వాచ్‌మెన్ అత్యాచారం జరపిన ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సంచలనం రేపింది. కాపాలా ఉండాల్సిన వారే కాలాంతకులుగా మారుతున్నారు. తాజాగా ముంబై నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా మహిళా రోగిపై లైంగికదాడికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సాక్షాత్తూ వాచ్‌మెన్ అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది. ఓ మహిళ కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముంబై నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఈ నెల 5వ తేదీన రాత్రి ఆసుపత్రి వాచ్ మెన్ కరోనా మహిళా రోగి ఉన్న వార్డులోకి ప్రవేశించాడు. గదిలో ఉన్న ఆమెపై అత్యాచారం చేశాడు. ఆసుపత్రిలోని తోటి రోగులు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాధిత కరోనా రోగి ఫిర్యాదుతో ఆసుపత్రి వాచ్ మెన్ పై కేసు నమోదు చేశారు. నిందితుడైన వాచ్ మెన్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని కురార్ పోలీసు అధికారి తెలిపారు. దీనిపై నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసులు చెప్పారు.

లవర్‌తో ఓయోకి వెళ్లినప్పుడు పోలీసులు వస్తే ఏం చేయాలి.?
లవర్‌తో ఓయోకి వెళ్లినప్పుడు పోలీసులు వస్తే ఏం చేయాలి.?
అన్నదాతలకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
అన్నదాతలకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
హోటల్ బిల్లు కట్టలేదు.. రోడ్డున పడ్డ పాక్ హాకీ జట్టు
హోటల్ బిల్లు కట్టలేదు.. రోడ్డున పడ్డ పాక్ హాకీ జట్టు
2019లో యూట్యూబ్‏ను ఊపేసిన సాంగ్.. ప్రతి అబ్బాయి ఏడ్చేసాడు భయ్యా..
2019లో యూట్యూబ్‏ను ఊపేసిన సాంగ్.. ప్రతి అబ్బాయి ఏడ్చేసాడు భయ్యా..
ఒక ప్లేట్ బియ్యం ధరే లక్షల్లో! తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.
ఒక ప్లేట్ బియ్యం ధరే లక్షల్లో! తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.
భర్తకు వాలంటైన్‌గిఫ్ట్‌ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ
భర్తకు వాలంటైన్‌గిఫ్ట్‌ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. మార్చి 1 నుంచి కొత్త యాప్..
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. మార్చి 1 నుంచి కొత్త యాప్..
గుణశీల విష్ణు దేవాలయం.. ఇక్కడికొస్తే మానసిక రోగాలు మాయం..
గుణశీల విష్ణు దేవాలయం.. ఇక్కడికొస్తే మానసిక రోగాలు మాయం..
హ్యాండ్ షేక్ వివాదంపై స్పందించిన పాక్ కెప్టెన్
హ్యాండ్ షేక్ వివాదంపై స్పందించిన పాక్ కెప్టెన్
ఆ కారణాలతో నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు: టాలీవుడ్ హీరోయిన్
ఆ కారణాలతో నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు: టాలీవుడ్ హీరోయిన్