AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలా అనడానికి సిగ్గులేదా.. అసలు అక్కడకు వెళ్లింది శెనగలు అమ్మడానికా ఏంది..!

పాకిస్థాన్ క్రికెట్ జట్టు (Pakistan Cricket Team) ఇంగ్లాండ్ (England) పర్యటనలో భాగంగా ఎదుర్కొన్న ఘోర పరాభవంపై ఆ దేశ మాజీ దిగ్గజ పేసర్ వసీం అక్రమ్ (Wasim Akram) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జట్టులో జరుగుతున్న కీలక మార్పులు కూడా తెలియకపోతే కెప్టెన్‌గా ఎందుకున్నారంటూ బాబర్ ఆజమ్‌ను (Babar Azam) ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించాయి.

అలా అనడానికి సిగ్గులేదా.. అసలు అక్కడకు వెళ్లింది శెనగలు అమ్మడానికా ఏంది..!
Wasim Akram, Babar Azam
Venkata Chari
|

Updated on: Sep 21, 2026 | 12:32 PM

Share

ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు వైట్ వాష్‌కు గురైంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఘోర ఓటమి చవిచూసిన తరువాత బోర్డు ప్రక్షాళన చర్యలకు దిగింది. హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ (Sarfaraz Ahmed), బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్ (Umar Gul) సహా సీనియర్ ఆటగాళ్లు మొహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan), ఇమామ్ ఉల్ హక్ (Imam-ul-Haq) ఇలా మొత్తం ఏడుగురు ఆటగాళ్లను అర్ధాంతరంగా స్వదేశానికి పంపించివేశారు. అయితే మూడో టెస్టుకు ముందు జట్టులో ఇంత పెద్ద ఎత్తున ప్రక్షాళన జరగడం తనకేమీ తెలియదని, అది తనకో కొత్త విషయమని కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆశ్చర్యకరమైన రీతిలో స్పందించారు.

జట్టు నాయకుడిగా ఉంటూ ఈ విషయాలు తెలియకపోవడంపై వసీం అక్రమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టులో ఏం జరుగుతుందో అసలు తెలియకపోతే మీరెందుకు అక్కడ ఉన్నారంటూ, శెనగలు అమ్మడానికి వెళ్లారా ఏంటంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

ఎక్కువమంది చదివినది: ఇంట్లో పులి.. విదేశాల్లో పిల్లి.. అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!

ఇవి కూడా చదవండి

కెప్టెన్ తన ఆటగాళ్ల వెంటే నిలబడాలని, లేకపోతే వంద శాతం ఫలితం ఇవ్వలేరని అక్రమ్ అభిప్రాయపడ్డారు. షాన్ మసూద్ (Shan Masood) స్థానంలో గత జూలై నెలలో మళ్లీ బాధ్యతలు చేపట్టిన బాబర్ ఆజమ్, వెస్టిండీస్ (West Indies) టూర్‌లో జట్టును సమర్థంగా నడిపించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ నిలిచినా, ఇంగ్లాండ్ టూర్‌లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. రెండో టెస్టు ముగిసిన తరువాతే బాబర్ కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పుకుని కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డాడు.

IND vs JPN: జపాన్‌తో తలపడే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఓపెనర్‌గా బుడ్డోడు ఫిక్స్..!

అనవసరంగా మళ్లీ పగ్గాలు చేపట్టి ఈ వివాదాలను కొనితెచ్చుకున్నాడని అటు ఫ్యాన్స్, ఇటు మాజీలు సైతం బాబర్ ఆజాంను కామెంట్స్ చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ బాబర్ నాయకత్వ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పాక్ నుంచి ఇంగ్లాండ్ వెళ్లింది శెనగలు అమ్మడానికా ఏంది..!
పాక్ నుంచి ఇంగ్లాండ్ వెళ్లింది శెనగలు అమ్మడానికా ఏంది..!
ఆ హీరో లాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు..
ఆ హీరో లాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు..
పెట్రోల్ పంపుల్లో రూ.2,000 కంటే ఎక్కువ UPI పేమెంట్లు బంద్?
పెట్రోల్ పంపుల్లో రూ.2,000 కంటే ఎక్కువ UPI పేమెంట్లు బంద్?
లవర్ లాంటి లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి..
లవర్ లాంటి లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి..
ఆ నటుడికి జరిగిన యాక్సిడెంట్ నా జీవితాన్ని మార్చేసింది..
ఆ నటుడికి జరిగిన యాక్సిడెంట్ నా జీవితాన్ని మార్చేసింది..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎప్పటి నుంచో తెలుసా..?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎప్పటి నుంచో తెలుసా..?
పక్షులూ మమ్మల్ని వింతగా చూస్తాయి..? 20వ అంతస్థు పై వీడియో
పక్షులూ మమ్మల్ని వింతగా చూస్తాయి..? 20వ అంతస్థు పై వీడియో
50 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్కూల్ ఫ్రెండ్స్..1976 బ్యాచ్ రీయూనియన్
50 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్కూల్ ఫ్రెండ్స్..1976 బ్యాచ్ రీయూనియన్
ఏపీలో పేషెంట్లకు గుడ్‌న్యూస్‌.. రూ.75 వేల విలువ టెస్ట్‌ ఉచితం..!
ఏపీలో పేషెంట్లకు గుడ్‌న్యూస్‌.. రూ.75 వేల విలువ టెస్ట్‌ ఉచితం..!
జై గణేశా.. జై జై గణేశా..! వినాయకుడికి హెలికాప్టర్‌తో పూల వర్షం..
జై గణేశా.. జై జై గణేశా..! వినాయకుడికి హెలికాప్టర్‌తో పూల వర్షం..