అక్క‌డ మూత్ర‌విస‌ర్జ‌న చేయాలంటే..హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి

Wear a helmet to attend to nature’s call : సికింద్రాబాద్ లోని బ్రిటిష్ కాలం నాటి పౌర ప్రాంతమైన కాక‌గూడ‌ 109 బ‌జారు (కార్కానా) ప్ర‌జ‌లు స్థానిక మిలిటరీ అథారిటీ అధికారుల ఆంక్ష‌ల ప‌ట్ల అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. అందుకు పెద్ద రీజ‌నే ఉందండోయ్. గ‌త ఆరు నెల‌ల నుంచి ఆ ప్రాంతంలో ప్ర‌జ‌లు మూత్ర విస‌ర్జ‌నకు వెళ్లాలంటే త‌ప్ప‌నిస‌రిగా హెల్మెట్ ధ‌రించాల‌నే ఆదేశాలు అమ‌ల‌వుతున్నాయి. అక్క‌డి స్థానిక మిల‌ట‌రీ అధికారులు ఒక దారిని […]

అక్క‌డ మూత్ర‌విస‌ర్జ‌న చేయాలంటే..హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 31, 2020 | 6:15 PM

Wear a helmet to attend to nature’s call : సికింద్రాబాద్ లోని బ్రిటిష్ కాలం నాటి పౌర ప్రాంతమైన కాక‌గూడ‌ 109 బ‌జారు (కార్కానా) ప్ర‌జ‌లు స్థానిక మిలిటరీ అథారిటీ అధికారుల ఆంక్ష‌ల ప‌ట్ల అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. అందుకు పెద్ద రీజ‌నే ఉందండోయ్. గ‌త ఆరు నెల‌ల నుంచి ఆ ప్రాంతంలో ప్ర‌జ‌లు మూత్ర విస‌ర్జ‌నకు వెళ్లాలంటే త‌ప్ప‌నిస‌రిగా హెల్మెట్ ధ‌రించాల‌నే ఆదేశాలు అమ‌ల‌వుతున్నాయి. అక్క‌డి స్థానిక మిల‌ట‌రీ అధికారులు ఒక దారిని మిన‌హాయించి అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల‌ను మూసివేశారు. కాకగూడ -108 బజారును పాకెట్ -1,2,3 గా విభజించారు. 130 కుటుంబాలు నివ‌శిస్తోన్న పాకెట్-3 ఏరియాలో ఒక వాష్ రూమ్ ఉంది. అది కూడా మెయిన్ గేటుకు 500 మీట‌ర్ల రేడియస్ ప‌రిధిలో ఉంది. దీంతో ఆ ప్రాంతంలో నివశిస్తోన్న ప్ర‌జంలంతా వాష్‌రూమ్ ఉప‌యోగించాలంటే మెయిన్ గేట్ గుండా మాత్ర‌మే రాక‌పోక‌లు జ‌ర‌పాలి.

ఇక అటువైపు నుంచి వెళ్తున్న‌వారికి హెల్మెట్ ఉందా..లేదా అని పక్కాగా త‌నిఖీ చేస్తున్నారు అధికారులు. కొంద‌రు పాకెట్-1,2 నివాశితులు హెల్మెట్ ఉప‌యోగిస్తున్నప్ప‌టికీ.. అక్క‌డికి వెళ్లాలంటే వారికి వేరే మార్గం కూడా ఉంది. ఇక్కడ ప్ర‌ధాన స‌మ‌స్య‌ల్లా పాకెట్-3 లో నివ‌శిస్తోన్న ప్ర‌జ‌ల‌కే. వాష్ రూమ్ కి హెల్మెట్ ధ‌రించి వెళ్ల‌డం మ‌రీ దారుణ‌మ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. క‌నీసం టీవీలో స‌రిప‌డ సౌండ్ పెట్టుకోవ‌డానికి కూడా అధికారులు అనుమ‌తించ‌డం లేద‌ని వారు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ఇక అక్క‌డ వాట‌ర్ ప్రాబ్ల‌మ్ కూడా పీక్స్ లో ఉంది. వారానికి ఒక‌సారి మాత్ర‌మే ట్యాంకర్ల‌లో నీళ్ల వ‌స్తాయ‌ని, వాటిని వార‌మంతా వినియోగించుకోవాల‌ని స్థానికులు చెబ‌తున్నారు.

Read More : గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాక్ : సబ్సిడీ డబ్బులు బంద్ !