AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాదాస్పదంగా మారిన వివేక్ ఒబెరాయ్ ట్వీట్

బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఈ మ‌ధ్య సినిమాల కంటే రాజ‌కీయాల్లో చాలా చురుకుగా ఉన్న ఆయన.. బీజేపీ పార్టీకే ఆయ‌న మ‌ద్ద‌తుని తెలుపప‌డ‌మే కాకుండా న‌రేంద్ర‌మోదీ బ‌యోపిక్‌లో మోదీగా న‌టించారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు స‌మీపిస్తున్న వేళ వివేక్ చేసిన ఓ ట్వీట్ సోష‌ల్ మీడియాలో క‌ల‌క‌లం సృష్టిస్తుంది. ఓ వైపు ఎగ్జిట్ పోల్స్ బీజేపీ మ‌ళ్లీ అధికారంలో వ‌స్తుంద‌ని సూచించాయి. అయితే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ని ఉద్దేశించి చేసిన […]

వివాదాస్పదంగా మారిన వివేక్ ఒబెరాయ్ ట్వీట్
TV9 Telugu Digital Desk
|

Updated on: May 30, 2019 | 6:14 PM

Share

బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఈ మ‌ధ్య సినిమాల కంటే రాజ‌కీయాల్లో చాలా చురుకుగా ఉన్న ఆయన.. బీజేపీ పార్టీకే ఆయ‌న మ‌ద్ద‌తుని తెలుపప‌డ‌మే కాకుండా న‌రేంద్ర‌మోదీ బ‌యోపిక్‌లో మోదీగా న‌టించారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు స‌మీపిస్తున్న వేళ వివేక్ చేసిన ఓ ట్వీట్ సోష‌ల్ మీడియాలో క‌ల‌క‌లం సృష్టిస్తుంది. ఓ వైపు ఎగ్జిట్ పోల్స్ బీజేపీ మ‌ళ్లీ అధికారంలో వ‌స్తుంద‌ని సూచించాయి.

అయితే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ని ఉద్దేశించి చేసిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. ఓ వ్యక్తి ఎడిట్ చేసిన ఫోటోను ఒబెరాయ్ ఆయన ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ ట్వీట్‌లో వివేక్ ఒబెరాయ్ ఒక‌ప్పుడు మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యరాయ్ ప్రేమికుడ‌ని, అంత కంటే ముందు స‌ల్మాన్‌ఖాన్‌తో కూడా ఆమె ప్రేమ‌లో వ్య‌వ‌హారం న‌డిపింద‌ని ఒక‌ప్పుడు మీడియాలో జోరుగా వార్త‌లు వినిపించాయి. కానీ అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌ను ఐశ్వ‌ర్య వివాహం చేసుకుంది. ఇప్పుడు వారికి ఓ పాప కూడా ఉంది. ఈ వ్య‌వ‌హారానికి, ఎన్నిక‌ల‌కు లింక్ పెడుతూ ప‌వ‌న్ సింగ్ అనే వ్య‌క్తి స‌ల్మాన్‌, వివేక్‌, అభిషేక్‌తో ఉన్న ఫోటోను క్రియేట్ చేసి పోస్ట్ చేశాడు. దాన్ని వివేక్ ట్విట్ట‌ర్ అకౌంట్ షేర్ చేస్తూ హ హ‌హ‌.. అంటూ మెసేజ్ పోస్ట్ చేశాడు.

దీనిపై ఇప్పుడు ఐశ్వ‌ర్యారాయ్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని ట‌చ్ చేయ‌డం ఎందుకు? అంటూ వివేక్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రాజ‌కీయంగా చాలా వ్య‌వ‌హారాలు జ‌ర‌గొచ్చు. కానీ ఎవ‌రో చేసిన ఫోటోను వివేక్ ఒబెరాయ్ పోస్ట్ చేయ‌డ‌మేంటి? ఇలా చేయ‌డం ద్వారా ఆయ‌నేం చెప్పాల‌నుకున్నారు? అంటూ జాతీయ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే వివేక్ ట్వీట్ పై జాతీయ మహిళ కమిషన్ సీరియస్ అయ్యింది. వివాదాస్పదంగా మారిన ట్వీట్‌పై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. మరి ఈ వ్యవహారంపై ఇటు వివేక్.. అటు అమితాబ్ ఫ్యామిలీ అండ్ ఐశ్వర్యారాయ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!