AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాల్‌ని మోసం చేసిన మహిళ.. పోలీసులకు ఫిర్యాదు

సామాన్యులే కాదు ప్రముఖులు కూడా పలుమార్లు మోసపోతుంటారు. అందులో సినిమా వాళ్లు మినహాయింపేం కాదు. తాజాగా యాక్షన్‌ హీరో విశాల్‌ని ఓ మహిళ మోసం చేసింది.

విశాల్‌ని మోసం చేసిన మహిళ.. పోలీసులకు ఫిర్యాదు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 03, 2020 | 12:43 PM

Share

సామాన్యులే కాదు ప్రముఖులు కూడా పలుమార్లు మోసపోతుంటారు. అందులో సినిమా వాళ్లు మినహాయింపేం కాదు. తాజాగా యాక్షన్‌ హీరో విశాల్‌ని ఓ మహిళ మోసం చేసింది. దీంతో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఏ విషయంలో విశాల్‌ మోసపోయారంటే..!

ఓ వైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే, మరోవైపు విశాల్‌ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ కింద ఈ నటుడు సినిమాలను నిర్మిస్తారన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆ కంపెనీ మేనేజర్‌ హరి చెన్నైలోని వడాపలాని పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళపై ఫిర్యాదు చేశారు. తమ కంపెనీలో ఆరు సంవత్సరాలుగా పనిచేస్తోన్న ఓ మహిళా ఉద్యోగి పలుమార్లు కంపెనీని తప్పుదోవ పట్టించి డబ్బులను తీసుకుందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఆ మహిళ 45లక్షలతో కొత్త ఇంటిని కొనుగోలు చేసిందని, తమ కంపెనీని నుంచి తస్కరించిన డబ్బుతోనే ఆమె ఆ ఇంటిని కొనుగోలు చేసిందని రాజా వెల్లడించారు. ఇక ఈ ఫిర్యాదును విరుగమ్‌బక్కమ్‌ స్టేషన్‌కు ఫార్వర్డ్‌ చేసినట్లు వడపలాని ఎస్సై తెలిపారు. కాగా విశాల్ చక్ర అనే చిత్రంలో నటించగా.. ఈ మూవీ త్వరలో ఆన్‌లైన్‌లో విడుదల అవ్వనుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకోగా.. సినిమాపై అంచనాలను పెంచేసింది.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా