రైతులూ పంట జాగ్రత్త..వర్షాలు పడబోతున్నాయ్..!

|

Dec 29, 2019 | 7:39 AM

ఒకవైపు దేశ రాజధాని ఢిల్లీ గడ్డకట్టుకుపోయే చలితో గజగజ వణుకుతుంటే, మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచనలు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. అమవాస్య తెల్లారి నుంచి ఉభయ రాష్ట్రాల్లో కూడా వాతావరణంలో మార్పులు వచ్చాయి. చలి తగ్గిపోయి, గాలులు తీవ్రత పెరిగింది. దీనిపై వాతావరణ శాఖ అధికారుల క్లారిటీ ఇచ్చారు. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో చలిగాలులు వీస్తున్నట్టు పేర్కొన్నారు. ద్రోణి కారణంగానే శుక్ర, శనివారాల్లో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులు పడ్డాయి. త్రిపుర నుంచి […]

రైతులూ పంట జాగ్రత్త..వర్షాలు పడబోతున్నాయ్..!
Follow us on

ఒకవైపు దేశ రాజధాని ఢిల్లీ గడ్డకట్టుకుపోయే చలితో గజగజ వణుకుతుంటే, మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచనలు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. అమవాస్య తెల్లారి నుంచి ఉభయ రాష్ట్రాల్లో కూడా వాతావరణంలో మార్పులు వచ్చాయి. చలి తగ్గిపోయి, గాలులు తీవ్రత పెరిగింది. దీనిపై వాతావరణ శాఖ అధికారుల క్లారిటీ ఇచ్చారు. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో చలిగాలులు వీస్తున్నట్టు పేర్కొన్నారు. ద్రోణి కారణంగానే శుక్ర, శనివారాల్లో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులు పడ్డాయి.

త్రిపుర నుంచి ఒడిశాకు ఆనుకుని బే ఆఫ్ బెంగాల్ వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మరో రొండు రోజులు పాటు ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైతులకు ఈ ఏడాది ఇప్పటివరకు బాగా కలిసొచ్చింది. ప్రతి సంవత్సరం పంట పండితే, గిట్టు బాటు ధర దొరిక్క..పోని ధర కాస్క మంచిగా ఉంటే పంట పండక..తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ ఏడాది అటు వరి ధాన్యంతో పాటు..వాణిజ్య పంటలైన మిర్చి, ప్రత్తి, పసుపు, కూరగాయలు వంటివి మంచి దిగుబడిని ఇవ్వడంతో పాటు అత్యధిక ధరలు పలుకుతున్నాయి. వర్షం పంటను నష్టపర్చకుండా ఉంటే..రైతు మోముల్లో ఈ ఏడాది నిత్యం చిరునవ్వులు పండనున్నాయి.