కోహ్లీ కెరీర్లో అత్యంత వరస్ట్ రికార్డ్…
భారత క్రికెట్ టీమ్ రథసారథి విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడు గ్రౌండ్‌లోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. మంచినీళ్లు తాగినంత సింపుల్ ఈ ఏస్ ప్లేయర్ సెంచరీలు కొడతాడు. అందుకే మన కెప్టెన్‌ని రన్ మెషీన్ అని పిలుచుకుంటారు ఫ్యాన్స్. ప్రజంట్ అదిరిపోయే ఫామ్‌తో మెస్మరైజ్ చేస్తోన్న కోహ్లీ..కివీస్‌తో జరిగిన రెండో వన్డేలో అత్యంత చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయిన సన్నివేశాలు చాలా అరుదు. […]
భారత క్రికెట్ టీమ్ రథసారథి విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడు గ్రౌండ్‌లోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. మంచినీళ్లు తాగినంత సింపుల్ ఈ ఏస్ ప్లేయర్ సెంచరీలు కొడతాడు. అందుకే మన కెప్టెన్‌ని రన్ మెషీన్ అని పిలుచుకుంటారు ఫ్యాన్స్. ప్రజంట్ అదిరిపోయే ఫామ్‌తో మెస్మరైజ్ చేస్తోన్న కోహ్లీ..కివీస్‌తో జరిగిన రెండో వన్డేలో అత్యంత చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.
విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయిన సన్నివేశాలు చాలా అరుదు. అలా చేసిన బౌలర్‌ని ప్రజంట్ జనరేషన్‌లో గొప్ప ఆటగాడిగా అభివర్ణించాల్సిందే. ప్రస్తుత క్రికెట్‌లో ప్రమాదకర బౌలర్‌గా పరిగణిస్తోన్న బుమ్రా కూడా..నెట్స్‌లో ప్రాక్టీస్ చేసే సమయంలో విరాట్‌ను బౌల్డ్ చేయడానికి చాలా కష్టపడుతుంటాడు. అలాంటిది ఇప్పుడు వరసగా మూడు సార్లు వరసగా వన్డే మ్యాచుల్లో బౌల్డ్ అయ్యి చెత్త రికార్డును అందుకున్నాడు కోహ్లీ. కివీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ చివరి మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు కోహ్లీ. తాజాగా జరుగుతోన్న న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో తొలి వన్డేలో స్పిన్నర్ ఇస్ సోధి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన విరాట్..రెండో వన్డేలో కూడా ఇదే తరహాలో సౌథీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు . కాగా వన్డే ఫార్మాట్‌లో విరాట్‌ని ఎక్కువ సార్లు ఔట్ చేసిన బౌలర్ల లిస్ట్‌లో ఇప్పటివరకు రవి రాంపాల్ మొదటి ప్లేసులో ఉండగా..ఇప్పడు ఆ ప్లేసులోకి సౌథీ కూడా వచ్చేశాడు. ఈ ఇద్దరు బౌలర్లు ఇప్పటివరకు ఆరేసి సార్లు కోహ్లీని డకౌటుకు పంపారు.